అతి త్వరలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభం: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

సంగారెడ్డి/పటాన్ చెరు, ఆగస్టు 29 (ప్రశ్న ఆయుధం న్యూస్): దశాబ్దాల కాలంగా కాలుష్యంతో సహజీవనం చేసి అంతు చిక్కని వ్యాధులు, అనారోగ్యాలతో ఇటు ఆర్థికంగా అటు ఆరోగ్య పరమైన సమస్యలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న ప్రజలకు, కార్మికులకు సాంత్వన చేకూరుస్తూ 300 కోట్ల రూపాయలతో పటాన్ చెరు పట్టణంలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని, అతి త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులు మీదుగా ప్రారంభించేందుకు సన్నహాలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం ఆస్పత్రి అధికారులతో కలిసి నిర్మాణ పనులను స్వయంగా పరిశీలించారు. అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆసియాలోనే అతి పెద్ద పారిశ్రామికవాడగా పేరుందిన పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని వివిధ పరిశ్రమంలో పనిచేస్తున్న కార్మికులకు ఆధునిక వసతులతో.. అత్యాధునిక వైద్య చికిత్సలతో.. లక్ష చదరపు అడుగుల్లో.. జి ప్లస్ టు అంతస్తుల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించడం జరిగిందని తెలిపారు. హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు. గత ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందని గుర్తు చేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆసుపత్రిని ప్రారంభించేందుకు సలహాలు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఎంఎస్ఐడీసీ) ఆధ్వర్యంలో నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ నియంత్రణలో 200 పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్వహణ కొనసాగుతుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఆసుపత్రి నిర్వహణ కోసం ప్రత్యేకంగా నిధిని ప్రభుత్వం ఏర్పాటు చేశారని తెలిపారు. పారిశ్రామిక ప్రాంతంలో వెలువడే కాలుష్యం మూలంగా వచ్చే వ్యాధులను గుర్తించి అందుకు అవసరమైన వైద్య విభాగాలను, నిపుణులైన వైద్యులు ఆస్పత్రిలో అందుబాటులో ఉంటారని తెలిపారు. దీంతోపాటు ప్రధానంగా పారిశ్రామికవాడల్లో జరిగే ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని అందుకు అవసరమైన అత్యాధునిక శస్త్ర చికిత్స విభాగాలు సైతం ఇందులో ఏర్పాటు కానున్నాయని పేర్కొన్నారు. ఆస్పత్రి నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందించిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment