క్రీడల్లో సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో వరల్డ్ తెలుగు ఐటి అసోసియేషన్ (WTIT) ఆధ్వర్యంలో హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ హ్యాకథాన్ అథ్లెటిక్స్ క్రీడా పోటీలు ఈ నెల 28, 29 తేదీలలో నిర్వహించనున్నట్లు జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు.
జిల్లా క్రీడాకారులు ఈ పోటీల్లో చురుకుగా పాల్గొని తమ ప్రతిభను చాటాలని ఆయన పిలుపునిచ్చారు. అథ్లెటిక్స్ క్రీడల ద్వారా ఆవిష్కరణలు, ఐక్యత, క్రీడా స్పూర్తిని పెంపొందించడం లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొననున్న ఈ పోటీలకు ఆసక్తి గల వారు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని సూచించారు.
మరిన్ని వివరాలకు 97365 60909, 63000 57052, 94408 46682 నంబర్లను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఉత్తర తెలంగాణ జోన్ సెక్రటరీ శ్రీకాంత్, అభిలాష్, మాధవ్, వివేక్ పాల్గొన్నారు.












