ఘనంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు
*దేవస్థాన చైర్మన్ ఇంగిలే రామారావు ఆలయ ధర్మకర్తలు*
*జమ్మికుంట ఇల్లందకుంట సెప్టెంబర్ 16 ప్రశ్న ఆయుధం*
మంగళవారం రోజున అపర భద్రాద్రి ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలోని గ్రామ దేవాలయం నందు శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని ఉట్టి కొట్టే కార్యక్రమం స్వామివార్లను ఊరేగింపుగా పల్లకిలో కార్యక్రమం నిర్వహించారు శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం చైర్మన్ ఇంగిలే రామారావు మాట్లాడుతూ ఆ దేవుని ఆశీస్సులు తెలంగాణ రాష్ట్ర ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని కోరుకోవడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి రామ్ స్వరన్ రెడ్డి, ధర్మకర్తలు పరమేష్, గోపాల్ రెడ్డి, కిషన్ రెడ్డి ,మల్లేష్, జూనియర్ అసిస్టెంట్ మోహన్ ,మల్లారెడ్డి ఆలయ అర్చకులు దేవస్థాన సిబ్బంది గ్రామ ప్రజలు భక్తులు తదితరులు పాల్గొన్నారు