తారా కళాశాల అధ్యాపకుడికి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు

సంగారెడ్డి, సెప్టెంబరు 4 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి తారా ప్రభుత్వ కళాశాలలో జీవశాస్త్ర అధ్యాపకుడిగా పని చేస్తున్న డాక్టర్ సదయకుమార్ కు తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించిందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రవీణ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డాక్టర్ సదయ కుమార్ డిగ్రీ స్థాయిలో విద్యార్థులకు బోధనలో ఆధునిక పద్ధతులను అనుసరించినందుకు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారిగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను సామాజిక సేవలో వివిధ కార్యక్రమాలలో భాగస్వాములుగా చేసినందుకు ఈ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అవార్డు లభించిందని అన్నారు. తమ కళాశాల అధ్యాపకుడికి తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం పట్ల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రవీణ, వైస్ ప్రిన్సిపల్స్, కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థిని, విద్యార్థులు సంతోషాన్ని వ్యక్తం చేయడమే కాకుండా అభినందనలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment