పటాన్ చెరు/అమీన్‌పూర్, డిసెంబర్ 18 (ప్రశ్న ఆయుధం న్యూస్): పెన్షన్‌దారులకు రావలసిన అన్ని హక్కులను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని, ఆ హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం (TSGREA) జిల్లా ఉపాధ్యక్షుడు పట్నం సురేందర్ గౌడ్ అన్నారు. జాతీయ పెన్షనర్ల దినోత్సవం పురస్కరించుకొని బుధవారం రాత్రి TSGREA అమీన్‌పూర్ శాఖ, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అమీన్‌పూర్ సంయుక్తంగా నిర్వహించిన పెన్షనర్ల దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పోరాడితేనే హక్కులు సాధించగలమని పెన్షనర్లకు ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లయన్స్ జోన్ చైర్మన్ బి.కృష్ణాగౌడ్, యం.వెంకటేశం ప్రసంగించారు. ధరమ్ స్వరూప్ నకర (డి.ఎస్. నకర) జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని భారత జాతీయ పెన్షనర్ల దినోత్సవాన్ని అమీన్‌పూర్‌లోని బృందావన్ టీచర్స్ కాలనీ క్లబ్ హౌస్‌లో ఘనంగా నిర్వహించారు. క్లబ్ అధ్యక్షుడు కూర నాగరాజు, అసోసియేషన్ కార్యదర్శి ఎన్నం రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పెన్షన్ బకాయిలు అందక పెన్షనర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆవేదనతో వెల్లడించారు. ఈ సందర్భంగా 80 సంవత్సరాలు దాటిన పెన్షనర్లు విట్టలరావు, పి.ఎల్లప్ప, బంధయ్యలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ పూర్వ అధ్యక్ష, కార్యదర్శులు యం.వెంకటేశం, కే.నాగభూషణం, ఆర్.ప్రభాకర్, జి. దశరథ్, సత్యనారాయణ, చక్రపాణి, నాగేశ్వర్ రావు, లయన్ బాధ్యులు కే.నాగరాజు, కే.సిద్ధిరాములు, రామ నర్సింహా రెడ్డి, వెంకటేశం, రమాకాంత్, కే.మహేందర్ రెడ్డి, రాజిరెడ్డి, రామచంద్రపురం విశ్రాంత సంఘం కార్యదర్శి సి.హెచ్. రాములు, కోశాధికారి జి. బస్వారాజు, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు
పెన్షనర్ల హక్కుల సాధనకై ఐక్య పోరాటం అవసరం: రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పట్నం సురేందర్ గౌడ్
Published On: December 18, 2025 7:58 pm