సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబరు 5 (ప్రశ్న ఆయుధం న్యూస్): రాష్ట్రంలోని నిరుపేద ప్రజలందరికీ మెరుగైన ఉచిత వైద్యం అందించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. శుక్రవారం మంత్రి దామోదర్ రాజనర్సింహ నారాయణఖేడ్ నియోజకవర్గంలోని పలు మండలాలలో సుడిగాలి పర్యటన చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు రూ.12.86 కోట్ల విలువైన వాళ్ళు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. మొదటగా నారాయణఖేడ్ జూకల్ చౌరస్తాలో రూ.1.15 కోట్లతో చేపట్టనున్న కన్వెన్షన్ సెంటర్ విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నారాయణఖేడ్ మండలం జూకల్ లో అటవీ శాఖ ఆధ్వర్యంలో రూ.3.9 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేయనున్న అర్బన్ ఫారెస్ట్ డెవలప్మెంట్ పార్కు శంకుస్థాపన చేశారు. దవ్వూరు నుండి మనూరు మండలం ఎన్జీ హుక్రానా వరకు ఉన్న ఆర్ అండ్ బి బీటీ రోడ్డు రూ .6 కోట్లతో చేపట్టనున్న పునరుద్ధరణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం నారాయణఖేడ్ పట్టణంలోని అంతర్గత రోడ్ల అనుసంధానానికి ఫార్మేషన్ రింగురోడ్డు ఏర్పాటు కోసం కోట్లతో నిర్మించనున్న సిసి రోడ్ల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం సిర్గాపూర్ లో రూ.1.56 కోట్లతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని జహీరాబాద్ ఎంపీ సురేష్ శేట్కార్, నారాయణఖేడ్ శాసన సభ్యుడు సంజీవరెడ్డిలతో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలో నిరుపేద ప్రజలు నాణ్యమైన ఉచిత విద్యతో పాటు మెరుగైన ఉచిత వైద్య సేవలు ప్రభుత్వపరంగా అందించడానికి చిత్తశుద్ధితో పని చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీగా ఉన్న తొమ్మిది వేల పోస్టులను భర్తీ చేసినట్లు తెలిపారు. త్వరలో వైద్య ఆరోగ్య శాఖలో మరో వేల పోస్టుల భర్తీకి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను కార్పోరేట్ ఆసుపత్రులకు దీటుగా అభివృద్ధి చేయడంతో పాటు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం ఉద్యోగుల ఖాళీలను భర్తీ చేయడం ద్వారా ఆసుపత్రుల ద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రజా ప్రభుత్వం ప్రతి జిల్లాలో ఒక డేకేర్ క్యాన్సర్ సెంటర్ ను ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి గ్రామంలో మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనాలు ద్వారా రోగులకు క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేలా మొబైల్ వాహనాలు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. హైవే రోడ్డులలో ప్రమాదాలు జరిగితే వెంటనే చికిత్స అందించడానికి ప్రమాదం జరిగిన 15 నిమిషాల్లో ఆసుపత్రికి చేరుకునేలా హైవేల వెంట ట్రామా కేర్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. హైవేల వెంట ప్రతి 30 కిలో మీటర్ల పరిధిలో ఒక ట్రామా కేర్ సెంటర్ ను ఏర్పాటు చేయడంతో పాటు అంబులెన్స్ లు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. అవసరాన్ని బట్టి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఏ రాత్రి పేషెంట్ వచ్చిన వైద్య సేవలు అందించాలని వైద్య అధికారులకు ఆదేశించారు.
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధికి చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
*నల్ల వాగు ప్రాజెక్టును టూరిస్టు కేంద్రంగా మార్చాలి:*
*నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి*
సిర్గాపూర్ లోని నల్లవాగు ప్రాజెక్టుకు నిధులు కేటాయించి టూరిస్ట్ కేంద్రంగా అభివృద్ధి చేయాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఈ సందర్భంగా మంత్రికి విజ్ఞప్తి చేశారు. సిర్గాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనానికి ఇంకా నిధులు అవసరమని ఎమ్మెల్యే కోరారు. ఆసుపత్రిలో వైద్యులను ఏర్పాటు చేయడంతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల ఆసుపత్రి గా మార్చాలని ఎమ్మెల్యే మంత్రికి విజ్ఞప్తి చేశారు.
*మారుమూల ప్రాంతమైన నారాయణఖేడ్ ను విద్యా, వైద్య రంగాల లో అభివృద్ధి చేయాలి:*
*జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్*
రాష్ట్రంలోని మారుమూల నియోజకవర్గమైన నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని విద్యా, వైద్య రంగాల్లో అభివృద్ధి పరచాలని, అవసరము ఉన్నచోట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లు ఏర్పాటుచేసి పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిందేలా చర్యలు చేపట్టాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఆవిష్కరించారు. ఎంపీ సురేష్ షెట్కర్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి, రెవెన్యూ అధికారులు,పంచాయతీరాజ్ ,అటవీ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.