భారత రాజ్యంగా నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతిని పురస్కరించుకుని, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత లిబర్టీ సర్కిల్ లోని ఆయన విగ్రహానికి నివాళులర్పించారు.
ది యునైటెడ్ ఫోరం ఫర్ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో కవిత పాల్గొని, బాబాసాహెబ్ బర్త్ డే కేక్ ను కట్ చేశారు.
ఈ సందర్భంగా, అంబేద్కర్ చేసిన సేవలను, ఆయన ఆశయాలను కవిత స్మరించుకున్నారు. ఆయన చూపిన మార్గంలో నడవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు హాజరై, అంబేద్కర్ కు ఘనంగా నివాళులర్పించారు.
అంబేద్కర్ చేసిన సేవలు దేశానికి ఎంతో స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు.











