రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా గారు సోమవారం సాయంత్రం చెన్నూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించి, పలు కీలక సూచనలు చేశారు.
పోలీస్ కమిషనర్ స్టేషన్ పరిసరాలతో పాటు, భౌగోళిక పరిస్థితులను, సిబ్బంది పనితీరును సమీక్షించారు. స్టేషన్ పరిధిలో నమోదవుతున్న కేసుల వివరాలు, గ్రామాల వారీగా నేరాల గణాంకాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు.
రిసెప్షన్ సిబ్బందితో సంభాషించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నేరాల నియంత్రణకు పెట్రోలింగ్, విజిబుల్ పోలీసింగ్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.
రాష్ట్ర సరిహద్దు పోలీస్ స్టేషన్ కావడంతో, సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, సరిహద్దు గ్రామాలను తరచుగా సందర్శించాలన్నారు.
మారుమూల ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, తద్వారా శాంతిభద్రతలను కాపాడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.











