సంగారెడ్డి, జూన్ 29
ప్రత్యేకసమగ్రజాబితాసవరణ(ఎస్ఐఆర్)కార్యక్రమంలోభాగంగాబీఎల్వోలు చేయాలి సుదర్శన్ రెడ్డిచేస్తున్న ను నుప్రతి ఇంటికి వెళ్లి పూర్తిగానింపితిరిగిసమర్పిస్తేనేవారిముసాయిదానమోదుఅవుతుందనిరాష్ట్రప్రధానఎన్నికలఅధికారిస్పష్టంచేశారు.సోమవారంహైదరాబాద్నుంచికలెక్టర్లు,ఎన్నికలఅధికారులతోవీడియోకాన్ఫరెన్స్నిర్వహించిఎస్ఐఆర్పురోగతిపైసమీక్షించారు.
ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా బీఎల్వోలు పంపిణీ చేస్తున్న ఎన్యూమరేషన్ ఫారాలను ప్రతి ఓటరు పూర్తిగా నింపి తిరిగి సమర్పిస్తేనే వారి పేరు ముసాయిదా ఓటరు జాబితాలో నమోదు అవుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, సంబంధిత ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎస్ఐఆర్ పురోగతి, ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ తదితర అంశాలపై సమీక్షించారు.
రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పూర్తి పారదర్శకంగా, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. బీఎల్వోలే స్వయంగా ప్రతి ఇంటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేయాలని, ఈ బాధ్యతలను ఇతరులకు అప్పగించడం లేదా వారి ద్వారా సర్వే నిర్వహించడం అనుమతించబోమని స్పష్టం చేశారు. సూపర్వైజర్లు తమ పరిధిలోని గ్రామాలు, పట్టణాల్లో నిరంతరం పర్యటిస్తూ బీఎల్వోల పనితీరును పర్యవేక్షించాలని సూచించారు.
ఓటర్లకు సహాయం అందించేందుకు ఏర్పాటు చేసిన 1950 ఓటర్ హెల్ప్‌లైన్, కలెక్టరేట్, ఈఆర్వో కార్యాలయాల్లోని హెల్ప్‌డెస్క్‌ల వివరాలను విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. ఫారాలు నింపడంలో ఇబ్బందులు ఎదురైతే ప్రజలు హెల్ప్‌లైన్, హెల్ప్‌డెస్క్‌ల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. విధుల నిర్వహణ సమయంలో బీఎల్వోలు ఎన్నికల సంఘం అందజేసిన టీ-షర్ట్, క్యాప్, ఐడీ కార్డు, బ్యాగ్‌ను తప్పనిసరిగా ధరించాలని తెలిపారు. దీంతో ప్రజలు వారిని సులభంగా గుర్తించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలతో మర్యాదగా, సహనంతో వ్యవహరించాలని బీఎల్వోలకు సూచించారు.
ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ, ఓటరు అవగాహన కార్యక్రమాలు, క్షేత్రస్థాయి అధికారుల పర్యటనలు, ప్రత్యేక కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా వేదికల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు.
కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ, జిల్లాలో ఇప్పటివరకు 55 శాతం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయిందని తెలిపారు. ఎస్ఐఆర్ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన పెరుగుతోందన్నారు. జిల్లాలో వంద శాతం ఫారాలు పంపిణీ చేసి, పూర్తిగా నింపిన ఫారాలను సేకరించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఓటరు అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడంతో పాటు ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నామని చెప్పారు. ఎన్యూమరేషన్ ఫారాలు నింపడంలో ప్రజలకు అవసరమైన సహాయం అందించేలా బీఎల్వోలు, బీఎల్వో సూపర్వైజర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. నిర్ణీత గడువులోగా ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ పాండు, ఆర్డీఓలు రాజేందర్, రమేష్, వెంకటేశం, ఎన్నికల విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.










