రాజన్న సిరిసిల్ల జిల్లాలో రోడ్డు ప్రమాదంలో మరణించిన హోమ్ గార్డ్ దేవయ్య కుటుంబానికి రూ. 30 లక్షల బీమా చెక్కును జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే అందజేశారు. యాక్సిస్ బ్యాంక్ యాజమాన్యం ఈ చెక్కును అందించింది.
జిల్లా పోలీస్ కార్యాలయంలో డిసిఆర్బీలో విధులు నిర్వహిస్తున్న హోమ్ గార్డ్ దేవయ్య, విధి నిర్వహణలో ఉండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన యాక్సిస్ బ్యాంకులో సాలరీ ఖాతా కలిగి ఉండటంతో, యాక్సిడెంటల్ డెత్ కింద మంజూరైన 30 లక్షల బీమా మొత్తాన్ని బ్యాంక్ యాజమాన్యం ఎస్పీ చేతుల మీదుగా దేవయ్య కుటుంబ సభ్యులకు అందజేసింది.
ఈ సందర్భంగా ఎస్పీ మహేష్ బి.గితే మాట్లాడుతూ, హోమ్ గార్డ్ దేవయ్య మరణం పోలీస్ శాఖకు తీరని లోటని, ఆయన కుటుంబానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. విధి నిర్వహణలో భద్రతా చర్యలు పాటించడం అత్యవసరమని సూచించారు.
ఈ కార్యక్రమంలో డిఎస్పీ లోకేంద్రచారి, వెంకటేశ్వర్లు, ఆర్.ఐ. రమేష్, యాక్సిస్ బ్యాంక్ ప్రతినిధులు, దేవయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సంఘటన పోలీస్ శాఖలో విషాదాన్ని నింపింది.











