కామారెడ్డి, 2026-06-29
జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్ల కోసం హైదరాబాద్ ఐ. అండ్. పి. ఆర్ కమిషనర్ కార్యాలయం ముట్టడికి వెళ్తున్న కామారెడ్డి జిల్లా ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ సభ్యులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ చర్యను అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్, హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్ల కోసం హైదరాబాద్ ఐ. అండ్. పి. ఆర్ కమిషనర్ కార్యాలయం ముట్టడికి వెళ్తున్న కామారెడ్డి జిల్లా ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ జర్నలిస్టులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ చర్యను అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది.
ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తెడ్డు సాయిలు మాట్లాడుతూ, జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం హైదరాబాద్ ఐ. అండ్. పి. ఆర్ కమిషనర్ కార్యాలయం ముట్టడికి బయలుదేరే ముందే పోలీసులు ఇళ్లలోకి వచ్చి ముందస్తు హౌస్ అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల హక్కులను కాలరాస్తోందని విమర్శించారు.
అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు, హెల్త్ కార్డులు వెంటనే మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లు సాధించుకునే వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఇలాంటి అరెస్టులకు ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ భయపడే ప్రసక్తి లేదని, ఎస్సీ, ఎస్టీ జర్నలిస్టులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో రాజు ఆశన్న, బాలాజీ, సంజీవులు పాల్గొన్నారు.










