సంగారెడ్డి, జూలై 15
మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) బుధవారం సంగారెడ్డిలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ (ఎస్ఎన్పీ) అమలు, అంగన్వాడీ కేంద్రాల విద్యుదీకరణ, గర్భిణులు, బాలింతలు, చిన్నారుల హాజరు, పోషకాహార సరుకుల సరఫరా, బాల్య వివాహాల నివారణ వంటి అంశాలపై ఆమె చర్చించారు.
మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) బుధవారం సంగారెడ్డి సమీకృత కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (ఆర్జేడీలు), జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ అధికారులతో (డబ్ల్యూఓలు) శాఖ పని తీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ (ఎస్ఎన్పీ) అమలు, అంగన్వాడీ కేంద్రాల విద్యుదీకరణ, గర్భిణులు, బాలింతలు, చిన్నారుల హాజరు, పోషకాహార సరుకుల సరఫరా, బడ్జెట్ విడుదల-వ్యయాల పురోగతి, బాల్య వివాహాల నివారణ, దత్తత ప్రక్రియల అమలు తదితర అంశాలపై మంత్రి సవివరంగా సమీక్షించారు.
జిల్లాల్లో సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని, గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందాల్సిన సేవలు ఎలాంటి జాప్యం లేకుండా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు పోషకాహార పంపిణీలో పారదర్శకత పాటించాలని సూచించారు. అదేవిధంగా బాల్య వివాహాలను అరికట్టేందుకు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా వ్యవహరించాలని, చట్టబద్ధమైన దత్తత ప్రక్రియలను ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులకు మంత్రి సూచించారు.
శాఖకు కేటాయించిన బడ్జెట్ను లక్ష్యాలకు అనుగుణంగా సద్వినియోగం చేస్తూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రతి అర్హ లబ్ధిదారునికి చేరేలా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.











