సంగారెడ్డి, జూలై 14
గజ్వేల్ ప్రజ్ఞాపూర్ టిజిఎస్ ఆర్టీసీ డిపోలో బీఎంఎస్ కార్మిక సంఘ్ నూతన కమిటీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మహిళా నాయకురాలు లక్ష్మీ డిపో అధ్యక్షురాలిగా, సాయి కిషోర్ సెక్రటరీగా, ఎం. శ్రీనివాస్ కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన కమిటీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపింది.
గజ్వేల్ ప్రజ్ఞాపూర్ టిజిఎస్ ఆర్టీసీ డిపో కార్మిక్ సంఘ్ (బీఎంఎస్) నూతన కమిటీ ఎన్నిక గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపోలో జరిగింది. ఈ ఎన్నికకు ఆర్టీసీ కార్మిక్ సంఘ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర స్వామి కృష్ణమూర్తి, గజ్వేల్ బీఎంఎస్ ఇంచార్జి మరాఠీ కృష్ణమూర్తి, సిద్దిపేట జిల్లా బీఎంఎస్ అధ్యక్షులు తిరుపతి గౌడ్, రాజయ్య అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా నూతన యూనియన్ను ఏర్పాటు చేశారు. డిపో అధ్యక్షురాలిగా మహిళా నాయకురాలు లక్ష్మీ, డిపో సెక్రటరీగా సాయి కిషోర్, కోశాధికారిగా ఎం. శ్రీనివాస్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీ సభ్యులు డిపో మేనేజర్‌ను కలిసి తమ పరిచయ వేదికను ఏర్పాటు చేసుకున్నారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షురాలు లక్ష్మీ, సెక్రటరీ సాయి కిషోర్ మాట్లాడుతూ, డిపోలో కార్మికులకు ఎలాంటి సమస్యలున్నా, నష్టం కలిగించే పరిస్థితులు తలెత్తినా వారి పక్షాన నిరంతరం పోరాడతామని తెలిపారు. కార్మికులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి కష్టాల్లో పాలుపంచుకుంటామని, వారితో కలిసి పనిచేస్తూ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపోను జిల్లాలోనే ఉత్తమ శ్రేణిలో నిలబెడతామని చెప్పారు. భవిష్యత్తులో బీఎంఎస్ కార్మిక సంఘ్‌ను ఉన్నత స్థాయిలో నిలబెడతామని వారు విశ్వాసం వ్యక్తం చేశారు.
అలాగే, డిపో వైస్ ప్రెసిడెంట్‌గా బాబు గౌడ్, జాయింట్ సెక్రటరీగా సయ్యద్ ఫయజుద్దీన్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా వంశీకృష్ణ, అడ్వైజరీ కమిటీ సభ్యులుగా శ్యామల, గీతాదేవి, రామదాసు, శ్రీనివాస్, సుకన్య, సాయి కిరణ్, ఖాజా పాషా, సభ్యులుగా వినయ్, సతీష్, రాజు, నవీద్, ఇసాక్, స్రవంతి, కృష్ణవేణి, సంగీత, చంద్రశేఖర్, రాజశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.











