సంగారెడ్డి, July 14
యువతకు జాతీయ స్థాయిలో సేవా కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పించే మై భారత్ (Mera Yuva Bharat - MY Bharat) కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని అదనపు కలెక్టర్ పాండు అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్ లోని ఆయన ఛాంబర్ లో మై భారత్ నమోదు డ్రైవ్‌కు సంబంధించి జిల్లా సలహా కమిటీ సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది.
యువతకు జాతీయ స్థాయిలో సేవా కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పించే మై భారత్ (Mera Yuva Bharat - MY Bharat) కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని అదనపు కలెక్టర్ పాండు అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్ లోని ఆయన ఛాంబర్ లో మై భారత్ నమోదు డ్రైవ్‌కు సంబంధించి జిల్లా సలహా కమిటీ సమావేశం అదనపు కలెక్టర్ పాండు అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువతను దేశ నిర్మాణంలో భాగస్వాములను చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మై భారత్ కార్యక్రమంలో యువత ఎక్కువ సంఖ్యలో నమోదు చేసుకునేలా విస్తృత అవగాహన కల్పించాలన్నారు. మై భారత్ పోర్టల్‌లో నమోదు చేసుకున్న యువతకు వివిధ జాతీయ, రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు, నాయకత్వ వికాసం, నైపుణ్యాభివృద్ధి శిక్షణలు మరియు యువజన అభివృద్ధికి సంబంధించిన అనేక అవకాశాలు లభిస్తాయని తెలిపారు.
జిల్లాలో నిర్దేశించిన నమోదు లక్ష్యాలను సాధించేందుకు గ్రామ, మండల స్థాయిలో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని, విద్యాసంస్థలు, యువజన సంఘాలు, క్రీడా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో డీఆర్ డీఓ జ్యోతి, జిల్లా పరిషత్ సీఈఓ జానకి రెడ్డి, జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కే.ధనంజనేయులు, జిల్లా విద్యాశాఖ, ఇంటర్మీడియేట్ శాఖ అధికారులు, మై భారత్ జిల్లా కార్యక్రమ అధికారి జి. కిరణ్ కుమార్, తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, ఎన్ఎస్ఎస్ మరియు ఎన్సీసీ ప్రోగ్రాం అధికారులు, తదితరులు పాల్గొన్నారు.











