నిజామాబాద్, 2026-07-14
నిజామాబాద్ నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. గస్తీ విధుల్లో ఉన్న పోలీసులు అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిని గుర్తించి, ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
నిజామాబాద్ నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గుర్తుతెలియని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది.
టౌన్–1 పోలీసుల కథనం ప్రకారం.. సోమవారం ఉదయం సుమారు 6 గంటల సమయంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో పడిఉండటాన్ని గస్తీ విధుల్లో ఉన్న ఆర్టీసీ పోలీసులు గమనించారు. వెంటనే 108 అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
మృతుడి వయస్సు సుమారు 55 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. అతడు గులాబీ రంగు చొక్కా, నీలం రంగు ప్యాంటు ధరించి ఉన్నాడు. జేబులను పరిశీలించగా, ఈ నెల 12వ తేదీ మధ్యాహ్నం 2.45 గంటలకు వర్ని నుంచి జారీ చేసిన ఆర్టీసీ బస్సు టికెట్ లభ్యమైంది.
మృతుడి వివరాలు తెలిసిన వారు లేదా అతడిని గుర్తించగలిగిన వారు నిజామాబాద్ టౌన్–1 పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని ఇన్స్పెక్టర్ బి. రఘుపతి కోరారు. సమాచారం అందించేందుకు 8712659714 నంబర్‌ను సంప్రదించవచ్చని తెలిపారు.











