సంగారెడ్డి, జూలై 22
తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (టీజేఎంయూ) గౌరవ అధ్యక్షుడు తోపాజి అనంతకిషన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హన్మంతు ముదిరాజ్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఈ లక్ష్య సాధనకు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సంగారెడ్డిలో జరిగిన ఉమ్మడి జిల్లా రీజియన సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు వారు మాట్లాడారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడమే ప్రధాన లక్ష్యంగా కలిసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు తోపాజి అనంతకిషన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హన్మంతు ముదిరాజ్ అన్నారు. సంగారెడ్డిలోని ఓ ఫంక్షనహాల్లో టీజేఎంయూ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా రీజియన టీజేఎంయూ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లాలోని మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల పరిధిలో ఉన్న అన్ని డిపోల టీజేఎంయూ నాయకులు, ఉద్యోగులు హాజరయ్యారు.
ఇటీవల టీజేఎంయూ గౌరవ అధ్యక్షుడిగా ఎన్నికైన తోపాజి అనంతకిషనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తోపాజి అనంతకిషన, హన్మంతు ముదిరాజ్లు మాట్లాడుతూ ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు గత కొన్ని రోజులుగా పోరాటం కొనసాగిస్తున్నామని అన్నారు. త్వరలో ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు.
ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయకముందే యూనియన్ ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటే రాబోయే ఎన్నికలలో అన్ని డిపోలలో టీజేఎంయూనే గెలిపించాలని కోరారు. గతంలో ఈయూ, టీఎంయూలు అధికారంలో ఉండి ఆర్టీసీ కార్మికులకు ఒరగబెట్టిందేమి లేదని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో టీజేఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు డీవీఆర్ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ స్వాములయ్య, చీఫ్ వైస్ ప్రెసిడెంట్ సీనయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోలి రవీందర్, కార్యదర్శి పల్లె కృష్ణమూర్తి, ప్రచార కార్యదర్శి జీవన, సలహాదారులు రాంచంద్రయ్య, సిటీ రీజియన కార్యదర్శి బుల్లెట్ పాండు, మెదక్ రీజియన కార్యదర్శి అంజయ్యగౌడ్, సంగారెడ్డి డిపో కార్యదర్శి విక్రమ్, సలహాదారులు విఠల్గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మధుకర్, మహేందర్, ఎం.రవి, స్వరూప, విజయ, అంజలి, సక్కుభాయి తదితరులు పాల్గొన్నారు.











