టీటీడీపై అవాస్తవాలు ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఈవో శ్యామలరావు, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు.
టీటీడీ ప్రతిష్ఠను దిగజార్చే విధంగా సోషల్ మీడియాలో వదంతులు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటాము అన్నారు. అలాంటి వార్తలు ప్రసారం చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని మీడియాను కోరారు. మాధవ నిలయంలోని అన్నప్రసాదములో తాము తిన్న అన్నప్రసాదంలో జర్రి కనబడిందని ఒక భక్తుడు చేసిన ఆరోపణలు వాస్తవదూరం అంటోంది టీటీడీ. తిరుమల శ్రీవారి దర్శనార్థం వేలాదిమంది భక్తులకు వడ్డించడానికి పెద్ద మొత్తంలో టిటిడి వారు అన్నప్రసాదాలను తయారుచేస్తారని చెబుతున్నారు.
అంత వేడిలో ఏమాత్రం చెక్కు చెదరకుండా ఒక జెర్రీ ఉందని సదరు భక్తుడు పేర్కొనటం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. ఒకవేళ పెరుగు అన్నాన్ని కలపాలంటే కూడా ముందుగా వేడి చేసిన అన్నాన్ని బాగా కలియపెట్టి తరువాత పెరుగు కలుపుతారన్నారు. అటువంటప్పుడు ఏమాత్రం రూపు చెదరకుండా జర్రి ఉండటం అనేది ఇది పూర్తిగా కావాలని చేసిన చర్య మాత్రమే గా భావించాల్సి వస్తుంది అన్నారు. దయచేసి భక్తులు ఇటువంటి సత్యదూర వార్తలను నమ్మకూడదని టీటీడీ విజ్ఞప్తి చేసింది.