Headlines:
-
“విద్యార్థిని జి.అక్షయ రాసిన దీపావళి ప్రత్యేక కవిత”
-
“నరకాసుర వధ: 8వ తరగతి విద్యార్థిని అక్షయ రచన”
-
“దీపావళి సందేశంతో విద్యార్థిని కవితా రచన”
-
“సహనాగరిక మరియు సాహిత్య ఆరాధనలో అక్షయ కవిత్వం”
సంగారెడ్డి ప్రతినిధి, అక్టోబరు 29 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి మున్సిపాలిటీ శాంతినగర్, స్థానిక విద్యా సంస్థ సెయింట్ ఆంటోనీ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని జి.అక్షయ సాహిత్యంపై మక్కువతో రచనలు చేస్తున్నది. దీపావళి సందర్భంగా విద్యార్థిని అక్షయ రాసిన కవిత..
*నరకాసుర వద.*
భూదేవి వరాహదేవ పుత్రుడు!
ప్రజల పట్ల మదమెక్కిన రాక్షసుడు!
తల్లి చేతిలోనే మరణం రాసుకున్నాడు.
ఇది బ్రహ్మదేవుడు ప్రసాదించిన వరం!
తల్లిదండ్రులే సత్యభామ శ్రీ కృష్ణులు
కృష్ణ మదిని తాకెను ప్రజల కంటతడి
కష్టాలను అంతం చేయాలని వెంటపడి.
తోడుగా బయలుదేరిన సత్యభామ!
యుద్ధం మద్యన స్పృహ తప్పిన భర్త
ఆ నరకాసురుడే దీనికంతటికి కర్త
అవధులు లేని సత్యభామ ఆవేశం
రాక్షసుడుని వధించటానికి ప్రవేశం!
తల్లి యొక్క బాణాల ప్రవాహం
ఆనాడే నరకాసురుడి అంతం
ఆరోజే ప్రజలాంతా చేసే దీపావళీ….!
*ప్రతి ఒక్కరికి దీపావళి శుభాకాంక్షలు*
జి.అక్షయ.
8వ తరగతి.
సెయింట్ ఆంతోని విద్యా సంస్థ, శాంతినగర్, సంగారెడ్డి.