విద్యార్థులు ఎందుకు ఇలా? ప్రవర్తిస్తున్నారు…. దీనికి బాధ్యులు ఎవరు.?..తుమ్మ కృష్ణ.

విద్యార్థులు ఎందుకు ఇలా? ప్రవర్తిస్తున్నారు…. దీనికి బాధ్యులు ఎవరు.?……….,……… ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు. తుమ్మ కృష్ణ..

మారుతున్న కాలానుగుణంగా మనుషులు మారాలి కానీ మానసిక ప్రవృత్తిని మార్చుకొని మనుషులు జంతువులు అసహ్యించుకునేలా ప్రవర్తిస్తున్నారు. చిన్నపిల్లల నుండి మొదలుకొని యువత వరకు వారి యొక్క ప్రవర్తన రోజురోజుకు ఎందుకు ఇలా దిగజారి పోతుందో అర్థం కాని పరిస్థితులు నేటి తరంలో నెలకొన్నాయి. పిల్లలు ఏం చేస్తున్నారో, ఏం ఆలోచిస్తున్నారు కూడా తెలియకుండా నేటి తల్లిదండ్రులు అనేక బాధ్యతలత, తలమునకలై తమ బాధ్యతలను మైమర్చిపోతున్నారు. ఇది అతి సామాన్య కుటుంబం నుండి మొదలుకొని సంపన్న కుటుంబ వరకు సాగుతుంది. అడ్డుకట్ట వేసేవారు లేరు. కుటుంబం కోసం ఆలోచించాల్సిన పెద్దలు కనుమరుగయ్యారు. కాపురాలు కనుమరుగవుతున్నాయి. పిల్లలే వద్దు నువ్వు నేనే ముద్దు అనే పరిస్థితి నెలకొన్నది . ఉన్న వారిని ఆలన, పాలన చూసుకోవడానికి అసలే సమయం దొరకడం లేదు. ఈమధ్య ఏ పేపర్ లో చూసిన టీవీలో చూసిన ఏదో ఒక న్యూస్ బాధాకరమైన సంఘటనలు అనేకం కనిపిస్తున్నాయి. ఒకప్పుడు ఇలాంటి సమస్యలు వేరే దేశంలో జరుగుతే చూసేవారు కానీ ఇప్పుడు మన చుట్టూ అనేక సంఘటనలు జరుగుతున్నాయి.

ఈ మధ్యకాలంలో చిన్న పిల్లలు సెల్ ఫోన్లు ఎక్కువగా చూస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లలు మారాం చేస్తున్నారని చేయకుండా ఉండాలంటే అనే ఉద్దేశంతో, తినడం లేదని, ఏడుస్తున్నారని… వారి చేతికి ఫోన్లు అప్పగిస్తున్నారు. కానీ ఇది భవిష్యత్తులో వాళ్ల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని నాశనం చేసే ప్రమాదానికి దారితీస్తుందని మర్చిపోతున్నాము. మానసిక వైద్యులు హెచ్చరిస్తున్నారు. విద్యార్థులు, యువతలో ఇన్సాత్మక ప్రవృత్తి ( వైలెంట్ బిహేవియర్.) కలగడానికి కారణాలు-పరిష్కార మార్గాలు.

హింసాత్మక ప్రవృత్తి కలిగే ప్రధాన కారణాలు ఏమిటంటే వ్యక్తిగత స్వేచ్ఛకు గాని తన సంతోషానికి గాని అడ్డు తొలగించుకోవడానికి, అవరోధాలను అధిగమించడానికి మనుషులు హింసాత్మక ప్రవృత్తిని పెంపొందించుకుంటారు. అలాగే మానసికంగా అతను తోటి వారిలాగా ఉండలేకపోవడం కూడా మానసిక దౌర్భాగ్యంగా భావించుకుని తనకు తానే కృంగి కృషి ఏదైనా నేరానికి పాల్పడడానికి వెనుక ముందు ఆలోచించరు. అలాంటి పరిస్థితులలో తాను ఏదైతే చేస్తాడో అదే వాస్తవమని భ్రమిస్తాడు. ఇలా మానసికంగా ఆందోళన పొంది ఒక ఆలోచనను పదేపదే ఊహించుకొని దానిని అలవాటుగా మార్చుకొని తనమీద తనకు నమ్మకం లేకపోవడం చివరకు తాను అనుకున్న పనిని చేస్తారు దీని వలన సమాజం అనేక సవాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆత్మ నియంత్రణ లోపం వలన తనకు వచ్చిన ఆలోచన ప్రతి దానిని ఎలాంటి విచక్షణ చేయకుండా తన కోపాన్ని అదుపులో పెట్టుకోలేకపోవడం ప్రతి దానిని సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. తక్కువ సహనం , కలిగిన వారు చిన్నచిన్న విషయాలకే కోపదకులై ఆగ్రహానికి కారణం ఇలాంటి పరిస్థితుల్లో తనకు అనుకూలంగా లేని ప్రతి విషయాన్ని ద్వేషించడం, లేదా శాశ్వతంగా తొలగించుకోవడం కోసం ఏదైనా చేయడానికి విద్యార్థులు, యువత ఈ మధ్యకాలంలో కన్న తల్లిదండ్రులను సైతం, కసాయి వారి కంటే దారుణంగా హింస కు గురి చేస్తూ చంపేస్తున్న సంఘటనలు అనేకం మనం చూస్తున్నాం. దీనికి కారణం హార్మోన్ల ప్రభావం ఒకటైతే, యవ్వన దశలో వచ్చే శారీరిక, రసాయనాలు వచ్చే మార్పులు ఆగ్రహాన్ని పెంచుతాయి. మానసిక ఒత్తిడి ఒకటైతే , చదువు, పరీక్షలు ఉద్యోగ బాధ్యతలు, భవిష్యత్తు పట్ల అవగాహన లేకపోవడం, ఇవన్నీ ఒకటైతే. కుటుంబ కారణాలు కూడా కావచ్చు. తల్లిదండ్రుల తగవులు, హింస చూడడం ఇంట్లోనే ప్రతిరోజు హింసనుచూస్తూ పెరగడం సామాజిక కారణాలు కూడా ఇన్సను ప్రోత్సహిస్తాయి.బానిసలవ్వడానికి ప్రధాన కారణం సినిమాలు, వెబ్ సిరిస్, వీడియో గేమ్స్, హింసాత్మక దృశ్యాలు, వీటిని అనుకరించే స్వభావం గల వ్యక్తులు, తల్లిదండ్రులే. బిజీ లైఫ్ స్టైల్స్ కారణంగా పిల్లలకు సరైన సమయం కేటాయించాలి అన్న బాధ్యతను బావిలో పడవేసి, తమ కొడుకులకు కూతుళ్లకు ఫోన్ ఇచ్చి తమ పని చూసుకుంటున్నారు. పిల్లలు మారాం చేసినప్పుడు ఫోన్ ఇవ్వడం, తినడం కోసం ఫోన్ అవసరం అనుకోవడం తల్లిదండ్రుల్లో పెరిగిన అభ్యాసం. అయినప్పటికీ, ఈ అలవాటు వ్యసనంగా మారిపోతూ, పిల్లల్లో ఆందోళన, నిరాశ, ఆగ్రహం పెరగడానికి దారితీస్తుంది. స్నేహితుల ఒత్తిడి ఒకటైతే, గట్టిగా మాట్లాడాలి, ఎదురు తిరగాలి అనే తప్పు ధోరణి అవలంబించడం మూలంగా అనేక అనర్ధాలకు దారితీస్తున్నాయి. మద్యం, మత్తు పదార్థాలు, కోపాన్ని నియంత్రించడంలో సహాయ పడతాయి. ఈమధ్య సోషల్ మీడియా ప్రేరేపణ, హింసను హీరో లాగా చూపించడం లాంటివి అనేక మధ్యమాలు విద్యార్థులను, యువతను బానిసలుగా చేస్తున్నాయి.

విద్య వ్యవస్థాపక కారణాలు:

పాఠశాలల్లో, కాలేజీలలో, వృత్తి, వ్యాపారాల్లో ఒత్తిడి, గురువుల నుండి సరైన మానసిక దిశ నిర్దేశం లేకపోవడం మూలంగా విద్యార్థులు సహనం కోల్పోతున్నారు. పాఠశాలలో తరచుగా క్రీడలు, సాంస్కృతిక కార్యకలాపాలకు అవకాశం లేకపోవడం మూలంగా తమ యొక్క శక్తిని హింసగా మార్చుకోవడం జరుగుతుంది. నిన్న మొన్న జరిగిన సంఘటనలో కారణం

సెల్ ఫోను కారణంగా వచ్చే ప్రమాదాలు:

మానసిక సమస్యలు, డిప్రెషన్, ఒత్తిడి, అగ్రెషన్, సోషల్ ఐసోలేషన్,

చదువుపై దుష్ప్రభావం, సోషలైజేషన్ పూర్తిగా దెబ్బతింటుంది. హత్య, ఆత్మహత్యలకు దారితీసే గంభీర పరిస్థితులు వయసు పెరిగే కొద్దీ వీడియోలు, ఆటలు, పోర్న్, బెట్టింగ్, బుల్లీయింగ్ వంటి డిజిటల్ డేంజర్ వల్ల పిల్లలు నేరాలకు పాల్పడే అవకాశాలు ఎంతగానో ఉన్నాయి.

పిల్లలకు ఫోన్ల ఉద్దేశపూర్వక వినియోగం గురించి చెప్పాలి,డిజిటల్ ఎక్స్పోజర్ టైం తగ్గించాలి, వారితో సమయం గడపాలి, ఆటలకి ప్రోత్సహించాలి, ఇంట్లో చిన్న పనుల్లో భాగం చేయాలి, తల్లిదండ్రులు స్వయంగా ఫోన్ వినియోగాన్ని తగ్గించాలి. లేకపోతే పిల్లల్ని కన్నందుకు అనేక బాధల్ని చవిచూడాల్సి వస్తుంది

పిల్లలు సెల్ ఫోన్లు వినియోగించకూడదని సామాజిక ఉద్యమానికి తెర తీయాలి

పిల్లలు చెడిపోవడానికి స్నేహితులు, ఉపాధ్యాయులు, ఫోన్లు, మీడియా, మాత్రమే కారకులు అని చెప్పలేము కానీ

తల్లిదండ్రులే. ఎక్కువగా బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుంది. అది ఎలాగో తెలుసుకుందాం…. పిల్లల్ని గారాబం మరీ శృతిమించితే మొత్తానికే నష్టం వస్తుంది.పిల్లల పట్ల మనం పాటిస్తున్న అజ్ఞానం, మూఢనమ్మకాలు, స్వార్థం, అతి ప్రేమనే వారిని చాలా వరకు బద్దకస్తుల్ని చేస్తుంది, వారిని నాశనం చేస్తున్నారు.!

ఇప్పుటి తరం పిల్లలు..తల్లిదండ్రుల మంచి నీళ్ళు, పాలు,కిరాణా సరుకుల కోసం బయటికి వెళ్ళమంటే వెళ్లరు.లంచ్ బ్యాగ్ లు, స్కూల్ బ్యాగులు శుభ్రం చేసుకోరు.కనీసం ఇంటి దగ్గర చిన్న చిన్న పనులలో సహాయం చేయరు. రాత్రి 10 గంటల లోపు పడుకుని, ఉదయం ఆరు లేదా ఏడు గంటల లోపు నిద్ర లేవమంటే లేవరు.గట్టిగా మాట్లాడితే ఎదురుతిరగబడి సమాధానం చెబుతారు.

తిడితే వస్తువులను విసిరి కొడతారు. ఎప్పుడయినా దాచుకోమని డబ్బులు ఇస్తే మనకు తెలియకుండా ఐస్ క్రీమ్ లు, కూల్ డ్రింక్ లు, నూడుల్స్ ప్యాకెట్లు, ఫ్రెండ్స్ కి పార్టీలు, ఫ్రెండ్స్ కోసం గిఫ్ట్ లు కొనుగోలు చేస్తున్నారు. ఈ ధర్మంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని

పిల్లలు సెల్ ఫోన్లు వినియోగించకూడదని సామాజిక ఉద్యమానికి తెర తీయాలి.

సహస్ర హత్య కేసులో సంచలన విషయాలు.!?

హత్య జరిగిన రోజే.. నిందితుడిని ముందే అనుమానించిన తల్లి.! వర్తన చూసి ప్రశ్నిస్తే.. దబాయించిన బాలుడు క్రైమ్‌ వెబ్‌సిరీస్‌లు చూసి తప్పటడుగులు.ఎవరైనా తోటి పిల్లల వస్తువులపై మనసు పడితే తనకూ కొనివ్వాలని తల్లిదండ్రులను పోరుపెడతారు..అతను మాత్రం ఇంట్లోకి చొరబడి ఎలా కొట్టేయాలో ప్లాన్‌ రాసుకున్నాడు. పిల్లలు తప్పు చేస్తూ దొరికిపోతే భయంతో పారిపోతారు.. అతను మాత్రం హత్య వరకూ వెళ్లాడు. ఇలాంటి నేరం చేస్తే ఎవరైనా భయపడిపోతారు.. అతను మాత్రం ఏ జంకూ లేకుండా ఆధారాలు మాయం చేయడానికి ప్రయత్నించాడు. పక్కింట్లో బాలికను చంపేసి కూడా బాధపడని అతడు.. అదేరోజు తన పెంపుడు కుందేలు చనిపోతే మాత్రం దిగాలు పడ్డాడు. అనుమానంతో ప్రశ్నించిన తల్లినీ మాయమాటలతో బురిడీ కొట్టించాడు. కూకట్‌పల్లి సంగీత్‌నగర్‌లో బాలిక సహస్ర హత్య కేసులో నిందితుడు పదో తరగతి విద్యార్థి ప్రవర్తన ఇది. విచారణలో అతడు వెల్లడించిన విషయాలకు పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌లో సీపీ అవినాశ్‌ మహంతి శనివారం మీడియాకు వెల్లడించారు.

కళ్లు మూసుకొని కత్తితో పొడిచి.

సెలవు రోజుల్లో గల్లీలో పిల్లలందరూ కలిసి క్రికెట్‌ ఆడేవారు. కొన్ని రోజుల క్రితం సహస్ర తమ్ముడి బ్యాట్‌ నచ్చిన నిందితుడు తానొకసారి ఆడి ఇస్తానని అడగ్గా.. అతడు అంగీకరించలేదు. దీంతో ఎలాగైనా దాన్ని కొట్టేయాలని నిర్ణయించుకున్నాడు. వారి అపార్ట్‌మెంట్ల మధ్య కేవలం 2 అడుగుల దూరం మాత్రమే ఉండటంతో రెండుసార్లు గోడదూకి వెళ్లి పరిశీలించాడు. ఇంట్లో వాళ్లు బయటకు వెళ్లినా తలుపులు తీసి లోపలకు వెళ్లే అవకాశం ఉందని గ్రహించాడు. ఓటీటీలో క్రైమ్‌ వెబ్‌సిరీస్‌లు, యూట్యూబ్‌లో సీఐడీ సీరియల్స్‌ చూసిన అనుభవంతో దొంగతనానికి పథకం రాసుకున్నాడు. ఎవరైనా అడ్డొస్తే భయపెట్టాలని వంటగదిలోని కత్తి తీసుకొని బయలుదేరాడు.కానీ, ఇంట్లో ఎవరూ ఉండరనకుంటే సహస్ర కనిపించడంతో కాసేపు ఆలోచించాడు. ఆమె టీవీ చూస్తుండటంతో గుట్టుగా వెళ్లి బ్యాట్‌ తీసుకొని బయలుదేరాడు. ఈలోపు బాలిక గమనించి దొంగదొంగ అంటూ కేకలు వేస్తూ.. ఇంటి గుమ్మం వద్ద అతని చొక్కా పట్టుకొని వెనక్కి లాగింది. మీ డాడీకి చెబుతానంటూ బెదిరించింది. దీంతో భయపడిన బాలుడు కత్తితో విచక్షణరహితంగా పొడిచాడు. మెడపై తీవ్రగాయం కావటంతో బాలిక నిర్జీవంగా పడిపోయింది. తరువాత బాలుడు కత్తిని అక్కడే నీళ్లతో కడుక్కొని, బ్యాట్‌ తీసుకొని తన ఇంటికి వచ్చాడు. ఇంత చిన్న వయసులోనే కరుడుగట్టిన అంతకుడిగా మారిపోయాడు, మీ పిల్లలు కూడా ఇలా మారకుండా ఉండాలంటే మీరే మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తల్లిదండ్రులారా గమనించండి మేల్కొనండి జాగ్రత్త పడండి మీ పిల్లల్ని మీరు రక్షించుకోకపోతే ఎప్పటికైనా ప్రమాదం .

ఇక కొందరు ఆడ పిల్లల ప్రవర్తన మహా డేంజర్ గా ఉంది.

కొందరు ఆడపిల్లలు అయితే తిన్న కంచం కూడా కడగటం లేదు.ఇల్లు ఊడ్చమంటే కోపాలు వచ్చేస్తున్నాయి. అతిథులు వస్తే కనీసం గ్లాసుడు మంచి నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచన లేని అమ్మాయిలు కూడా ఉన్నారు.20 సంవత్సరాలు దాటిన చాలామంది ఆడపిల్లలకు వంట కూడా చేయడం రావటం లేదు.బట్టలు పద్ధతిగా ఉండాలి అంటే ఎక్కడలేని కోపం వీరికి. కల్చర్, ట్రెండ్, టెక్నాలజీ పేరిట వింతపోకడలు.వారిస్తే వెర్రి పనులు. దీంతో తల్లిదండ్రులు మదనతో ఏం చెప్పలేకపోవడం గమనర్హం.మనమే పిల్లలచేత అవన్నీ చేయించడం లేదు,కానీ కారణం మనమే..ఎందుకంటే మనకు అహం, పరువు, ప్రతిష్టలు అడ్డొస్తున్నాయి.చూసేవాళ్లకు మనం మంచి హోదాలో ఉండాలి, రిచ్ లుక్, స్టేటస్ మెయింటైన్ చేయాలి అని భ్రమలో ఉన్నాం.

గారాబంతో పెరిగిన వారు మధ్యలో మారమంటే మారడం అస్సలు జరగదు.

సోమరి పోతుల్లా తయారు కావడానికి తల్లిదండ్రులే కారణం.!

వారిని కష్ట పెట్టమని కాదు ఇక్కడ చెప్పేది

కష్టం గురించి తెలిసేలా పెంచండి.

కష్టo, డబ్బు, సమయం, ఆరోగ్యం విలువ తెలియకపోతే.. వారికి జీవితం విలువ తెలియదు.ప్రేమతో, గారాబంగా మనం చేస్తున్న తప్పుల వల్లే.. కొందరు యువత 15 ఏళ్లకే సిగరేట్స్, మందు, బెట్టింగ్, దొంగతనాలు, డ్రగ్స్, రేప్ లు, హత్యలు చేస్తున్నారు.మరికొంతమంది సోమరిపోతుల్లా తయారు అవుతున్నారు.

పెద్దలు కనిపిస్తే నమస్కరించే పద్ధతులు కూడా కొన్ని ప్రాంతాల్లో కనుమరుగవుతున్నాయి. అణకువగా ఉండటం రాదు, సంస్కృతి, సంప్రదాయాలు పట్టించుకోవడం లేదు.ఇలాగే ఉంటే కొంత కాలానికి తల్లిదండ్రులను గౌరవించే పద్ధతి కూడా లేకుండా పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

గుడ్, బయటి ఫుడ్, మీకు అనారోగ్యం, హాస్పిటల్లో బెడ్,

ప్రస్తుత ఈ కాలంలో నేటి యువత బయటి ఫుడ్ కు అలవాటు పడి, బిర్యానీలు, కర్రీ పాయింట్ ల వెంట పడుతూ చిన్న వయసులో దీనివల్ల వారి మానసిక రుగ్మతలు పెరిగిపోయి వారు ఏమి చేస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంటుంది. దీనివల్ల శారీరక మానసిక సంఘటనలు అనుభవించాల్సి వస్తుంది. ఇలా యువతలో మార్పులు రావడం చూసి తల్లిదండ్రులు తల్లడిపోతున్నారు. అయోమయానికి గురవుతున్నారు. ఆహార అలవాట్లలో మార్పులు రావాలి.

మన ధర్మం పట్ల, సనాతన సాంప్రదాయం పట్ల విశ్వాసం లేకపోతే పిల్లల్లో కలుగుతున్న ఈ విపత్తును తుంచి వేయకపోతే మరింత ప్రమాదం ఏర్పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

గతంలో నానమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్యలు వస్తున్నారంటే పిల్లలకు ఒక పండగ వాతావరణం కనిపించేది. మారుతున్న ఈ కాలంలో ఆ బంధాలు తెగిపోయాయి, నాడు గ్రామీణ ప్రాంతాల్లో తాజా తాజాగా పళ్ళు ఫలాలు కూరగాయలు ఆకుకూరలు ఎన్నో లభించేవి అవి తిన్నవారు ఆయురారోగ్యాలతో ఉండడంతో పాటు మనిషి మనుగడ సాఫీగా సాగుతుండే , కాలం మారిపోయింది దీంతో..కొన్ని ఆహార పదార్థాలు ఎంత ఆరోగ్యకరమైన కూడా వాళ్లకు అనవసరం.కాలేజీ పిల్లలు అయితే సరిగ్గా ఒక పిడికిలి పట్టేంత టిఫెన్, లంచ్ చిన్న బాక్సు రైస్.చాలామంది ఫ్రూట్స్ అసలు తినరు. దీంతో మానసిక ఎదుగుదల క్షీణించిపోయి ఎంత చదివినా కానీ వారి మెదడుకు ఎక్కక దీనితో పాటు సెల్ ఫోన్లు వాడడంతో వారు ఎంత చదివినా గాని వారి దృష్టి అంతా మొబైల్ లోనే ఉండడం వల్ల వాళ్ళు చదువుకోలేక పోవడం క్రైమ్ మద్యం,మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. అనుక్షణం వీరు తల్లిదండ్రులు నిఘా పెట్టి అరికట్టకపోతే కన్న పిల్లలే శత్రువుగా మారి తల్లిదండ్రులను హతమార్చే రోజులు దాపురించాయి. పిల్లల్లో కలుగుతున్న ఈ విపత్తును తుంచి వేయకపోతే మరింత ప్రమాదం ఏర్పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

తల్లిదండ్రులు మారాలి, రేపటి తరం కోసం ఏమి నేర్పుతున్నాం.? ఒక్కసారి ఆలోచన చేయండి..

ప్రతి తల్లి తండ్రి కొడుకో బిడ్డో పుట్టగానే చాలా సంతోషిస్తారు కడుపు కట్టుకొని పిల్లలు పుట్టారని మరికొంత కష్టం చేసి నాలుగు రూపాయలు వెనుకేసే కోసం శ్రమిస్తుంటారు. పిల్లల ఆలన పాలన చూసి స్కూల్లకు పంపి వారి ఎదుగుదలకు తల్లితండ్రులు వేల కట్టలేని సేవలు చేస్తుంటారు. పిల్లలకు ఏదైనా జరగరానిది జరిగితే ఆ తల్లి తండ్రుల బాధ వర్ణనాతీతం. ఆ బాధలను ఏ భగవంతుడు కూడా తీర్చలేడు. ఆ తల్లి తండ్రులు బ్రతికున్నంత వరకు వారిని ఆ బాధ వెంటాడుతూనే ఉంటుంది. ఇది తెలియని కొందరు పిల్లలు తల్లితండ్రుల మాట వినక వారి జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు.

వీటన్నికి కారణం మనం, మన పిల్లలను సరైన పద్ధతిలో పెంచకపోవడమే..!అందుకే తల్లిదండ్రులు మారాలి,రేపటి సమాజానికి ఏమి నేర్పుతున్నాం…? ఒక్కసారి ఆలోచన చేయాలి

పిల్లలకు బాధ్యత మర్యాద గౌరవం కష్టం నష్టం ఓర్పు సహనం దాతృత్వం ప్రేమ

అనురాగం సహాయం సహకారం

నాయకత్వం మానసిక ద్రృఢత్వం కుటుంబ బంధాలు. అనుబంధాలు దైవ భక్తి ,దేశ భక్తి

ఈ భావనలు…సంప్రదాయాలు అంటే..!

కొంచెం కష్టమైనా సరే ఇవి తప్పక చిన్న వయసులోనే పిల్లలకు అలవాటు చేయాలి.

పరిష్కార మార్గాలు: వ్యక్తిగత స్థాయిలో కోప నియంత్రణ శిక్షణ ఇవ్వాలి. (Anger management), శ్వాస నియంత్రణ, ధ్యానము, యోగ, ఆధ్యాత్మికత ఆలోచనలు చిన్నప్పటినుండే అవగాహన కల్పించాలి. చిన్నప్పటినుండి ధనాత్మక ఆలోచన లేకపోవడం, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని ఆలోచన లేకపోవడం మూలంగా అనేక అనర్ధాలు జరుగుతున్నాయి. హింసే పరిష్కారం కాదని అర్థం చేసుకునే సంస్కార భావాలు లేకపోవడం మూలంగా సహనం, సంభాషణ నైపుణ్యాలు పెంపొందించుకోకపోవడం మూలంగా తన భావాలను సాఫీగా చెప్పలేకపోవడం మూలంగా వ్యక్తిగత స్థాయిలో మానసిక అలజడులు ఎదుర్కొంటున్నారు.

కుటుంబ స్థాయిలో; స్నేహపూర్వక వాతావరణం కల్పించడం వలన కొంతవరకు కోపాన్ని నియంత్రించవచ్చు. పిల్లలతో తల్లిదండ్రులు తరచూ చర్చించడం, వారి యొక్క సమస్యలను తీర్చడం కూడా ఇందులో ఒక భాగమే. ప్రధానంగా వారి సమస్యలను వినడానికి ప్రయత్నించాలి. హింస లేకుండా పరిష్కారం చూపగలగాలి. ఇలాంటి వాటిలో తల్లిదండ్రులు ఆదర్శంగా ఉండాలి. పిల్లలపై తగిన శ్రద్ధను చూపకపోవడం, అలాగే ప్రేమగా వారితో ప్రవర్తించలేకపోవడం మూలంగా నిర్లక్ష్యంతో తల్లిదండ్రులు ప్రవర్తిస్తే పిల్లలు, యువత హింస మార్గం వైపు మళ్ళిస్తుంది.

(విద్యాసంస్థలో): ప్రతి గురుకుల పాఠశాలలో, అలాగే కళాశాలలో కౌన్సిలింగ్ సదుపాయం లేకపోవడం మూలంగా వారి యొక్క సమస్యలను ఎవ్వరికీ చెప్పుకోలేక హింస పరువృత్తికి దారితీస్తున్నాయి. విద్యార్థులకు మానసిక సహాయం కూడా ఆ యొక్క విద్యాలయాల కనీస బాధ్యతగా అందరు గుర్తించగలగాలి. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రతి నెలకోసారి ఏర్పాటు చేసినట్లయితే వారిలో దాగి ఉన్న సృజనాత్మకత శక్తిని సద్వినియోగించుకోవడానికి తగిన అవకాశం కల్పించినట్లు అవుతుంది. విలువల ఆధారిత విద్యను ప్రత్యేకతలలో బోధన చేయాలి. సహనం, పరస్పర గౌరవం, సహజీవన విలువలను, తల్లిదండ్రులను, పెద్దలను గౌరవించేటట్లుగా పాఠశాలల్లో తీర్చిదిద్దాలి. స్నేహపూర్వక గురువులు వారికి తోడుగా ఉంటే మరింత ఉన్నంతగా విద్యార్థులు రాణిస్తారు. జీవితం పట్ల సరైన అవగాహన ఏర్పడుతుంది. ప్రభుత్వ, ప్రైవేటు, అనేక సంస్థలు విద్యార్థుల సమస్యలను గమనించి పరిష్కార మార్గం చూపించాలి.

సమాజం ఏమి నేర్పించాలి; మీడియాలో హింస తగ్గించడం ప్రధానంగా తగ్గించాలి. ప్రతి ఇంట్లో ఇంటర్నెట్ సినిమాలు, సీరియల్స్ ఎప్పుడంటే అప్పుడు చూసుకోవడానికి వీలును వీలైనంతగా తగ్గించాలి. సెల్ ఫోన్లలో హింస ను చూపించడం మూలంగా తమకు తామే అనేక నిర్ణయాలు తీసుకొని ఆకర్షణకు లోనవుతున్నారు. బాధ్యతయుతమైన మాధ్యమాలు తమ హద్దులను దాటకుండా సమాజ శ్రేయస్సు కోసం పనిచేయగలగాలి. లేకపోతే ఈ ప్రసార మాధ్యమాలు అందరి జీవితాలను శాసించడం మూలంగా అందరినీ మార్చే శక్తి కూడా ఈ మాధ్యమాలకే ఉన్నది కాబట్టి ప్రసారమధ్యలపై ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నియంత్రణ ఉంటే బాగుంటుంది.

ముగింపు ఏమిటంటే: విద్యార్థులు, యువతలో హింసాత్మక ప్రవృత్తి అనేది ఒక కారణం వల్ల కాదు. ఇది మానసిక, కుటుంబం, సామాజిక, విద్య కారకాల సమ్మేళనం వలన సంభవిస్తుంది. సరైన మార్గదర్శనం, విలువల బోధన పెంపొందించాలి, సానుకూల వాతావరణం, ఆరోగ్యకరమైన అభిరుచులు కల్పించడం ద్వారా హింసను కొంతవరకు అరికట్టవచ్చు. యువతను సృజనాత్మకత మార్గాల్లో నడిపించాల్సింది తల్లిదండ్రులే. ఇందులో ప్రతి ఒక్కరి పాత్ర ఉంటుంది సమాజం అంటే మన అందరి యొక్క సమ్మేళనమే కాబట్టి. అవునో కాదో ఒకసారి అందరూ ఆలోచించండి………..

తుమ్మ కృష్ణ. ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు.

Join WhatsApp

Join Now

Leave a Comment