సంగారెడ్డి, మే 1 (ప్రశ్న ఆయుధం న్యూస్): కంది మండలం మామిడిపల్లి ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచి సత్తా చాటారు. పాఠశాల నుండి చిటుకుల రక్షిత 563 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచారు.
కురుమ కీర్తన 555 మార్కులతో ద్వితీయ స్థానం, కురుమ వైష్ణవి 540 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచారు. వీరే కాకుండా 500కు పైగా మార్కులు 6 మంది విద్యార్థులు సాధించారు. అలాగే ఇద్దరు విద్యార్థులు గణితములో వందకు వంద మార్కులు సాధించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జి.సుజాత మంచి ప్రతిభ కనబర్చినందున విద్యార్థులను, ఈ ఫలితాలు సాధించటానికి శ్రమించిన ఉపాధ్యాయులను అభినందించారు. మంచి ఫలితాలు సాధించినందున విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.