*డిగ్రీ కళాశాలలో మొక్కలు నాటిన విద్యార్థులు*

*డిగ్రీ కళాశాలలో మొక్కలు నాటిన విద్యార్థులు*

IMG 20240809 180043
మెదక్/నర్సాపూర్, ఆగస్టు 9 (ప్రశ్న ఆయుధం న్యూస్): మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (పెద్దచింతకుంట)లో స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ డా.పి.దామోదర్, తెలంగాణ గజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు గుండం మోహన్ రెడ్డి, కళాశాల అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్ధులు అందరు కలసి వివిధ రకాల మొక్కలను కళాశాల ప్రాంగణంలో నాటారు. ఎన్ ఎస్ ఎస్ మరియు వృక్షశాస్త్రం విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ గజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు గుండం మోహన్ రెడ్డిని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ దామోదర్, కళాశాల సిబ్బందితో కలిసి విద్యార్థుల సమక్షంలో శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు సమీర, నజీన్, పొలిటికల్ సైన్స్, బి.రుక్మిణి దేవి, వృక్షశాస్త్రం, జాతీయ సేవా పథకం ఎన్ ఎస్ ఎస్ కో-ఆర్డినేటర్ వి.హేమంత్ కుమార్ చారి గణితం, డా.పి.సౌమ్య ఫిజిక్స్ , రాజు, రాములు, మహేందర్ రెడ్డి మరియు అధ్యాపకేతర సిబ్బంది ఇ.వేణు, వి.కిష్టయ్య, జి.బాలయ్య, కె.రాధిక, విద్యార్థులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now