ఈనెల 20 న జరిగే మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయండి

ఈనెల 20 న జరిగే మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయండి

మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పొనగంటి మల్లయ్య

జమ్మికుంట ఆగస్టు 10 ప్రశ్న ఆయుధం

ఈనెల 20న బుధవారం జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని దుబ్బ మల్లన్న ఆలయ ఆవరణంలో హుజురాబాద్ నియోజకవర్గ మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని మున్నూరు కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పొన్నగంటి మల్లయ్య, సింగిల్ విండో అధ్యక్షుడు పొన్నగంటి సంపత్ అన్నారు. ఆదివారం జమ్మికుంట మండల కేంద్రంలో మున్నూరు కాపు కుల బాంధవుల సంఘ సమావేశము మున్నూరు కాపు సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షుడు ఏబూసి శ్రీనివాస్ అధ్యక్షతను నిర్వహించారు సమావేశంలో వారు మాట్లాడారు. శ్రావణ మాసంలో మున్నూరు కాపు కుల బాంధవులందరూ వనభోజనాల కు వెళ్లడానికి నిర్ణయించడం జరిగిందని సంఘ జమ్మికుంట పట్టణ, మండల అధ్యక్షుడు ఏబూసి శ్రీనివాస్ ,తోట లక్ష్మణ్, వీణవంక, ఇల్లందకుంట మండల అధ్యక్షులు చేరాలు, రమేష్, నాయకులు ఆకుల రాజేందర్, సాయిని రవి మాట్లాడుతూ రాజకీయ పార్టీలకతీతంగా ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు నియోజకవర్గంలోని హుజురాబాద్ జమ్మికుంట కమలాపూర్ వీణవంక ఇల్లందకుంట మండలాల్లో ఉన్నటువంటి మున్నూరు కాపు కుల బాంధవులు తమ కుటుంబ సమేతంగా వనభోజనాలకు విచ్చేసి జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, వేములవాడ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్, మాజీమంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మున్నూరు కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పుటం పురుషోత్తం రావు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లా హరిశంకర్, కరీంనగర్ ఉమ్మడి జిల్లా మాజీ ఎమ్మెల్యేలు నాయకులు పాల్గొంటారని వారు తెలిపారు. కాబట్టి ఈ ఆత్మీయ సమ్మేళనానికి నియోజకవర్గ మున్నూరు కాపు కుటుంబ సభ్యులందరూ కుటుంబ సమేతంగా విచ్చేసి జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు పొనగంటి సారంగం, పొన్నగంటి మల్లయ్య కాంట్రాక్టర్, ఆకుల రాజయ్య, కడెం జనార్ధన్, కొల కానీ రాజు, కాసర్ల రాములు, పొన్నగంటి రవికుమార్ పిజేఆర్, పొ నగంటి రవీందర్, పొనగంటి కొమరయ్య, ఊడుగుల మహేందర్ ,నీరటి సతీష్, ఆకుల పోచయ్య,ఏ బూషి ఓదెలు, జెమిని సురేష్ ,కడెం సతీష్, శెట్టి ఉదయ భాస్కర్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment