జాతీయ సమైక్యత శిబిరానికి తారా విద్యార్థులు

IMG 20250127 184136

సంగారెడ్డి ప్రతినిధి, జనవరి 27 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి తారా ప్రభుత్వ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ లో జరిగే ఎన్ఎస్ఎస్ జాతీయ సమైక్యత శిబిరానికి ఎంపిక కావడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రత్నప్రసాద్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ సహకారంతో ఎన్ఎస్ఎస్ రీజినల్ డైరెక్టరేట్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జాతీయ సమైక్యత శిబిరానికి తమ కళాశాలకు చెందిన జి. సౌమ్య, సి.హెచ్.రాజేష్ లు ఎంపికయ్యారని అన్నారు. ఈ ఎన్ఎస్ఎస్ జాతీయ సమైక్యత శిబిరం ఆంధ్రప్రదేశ్ లోని వెస్ట్ గోదావరి జిల్లా నర్సాపూర్ లో ఫిబ్రవరి 3వ తేదీ నుండి 9వ తేదీ వరకు జరుగుతుందని, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి 6 మంది విద్యార్థుల బృందం బయలు దేరుతుందని, అందులో తమ కళాశాలకు చెందిన ఇద్దరు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు అవకాశం కలగడం చాలా సంతోషమని తెలిపారు. ఈ జాతీయ సమైక్యత శిబిరానికి తమ కళాశాలకు చెందిన విద్యార్థులను ఎంపిక చేయడం పట్ల ఉస్మానియా విశ్వవిద్యాలయ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ విద్యాసాగర్ కు ప్రత్యేక కృతజ్ఞతలను తెలిపారు. తమ కళాశాలలో కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ పేర్కొన్న ప్రతి కార్యక్రమాన్ని నిర్వహించడం, స్వచ్ఛత హి సేవ, ట్రాఫిక్ నిబంధనలు, మత్తు పదార్థాల వినియోగాలకు సంబంధించి విద్యార్థులలో అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలను నిర్వహించడం వల్ల ఈ అవకాశం దక్కిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జగదీశ్వర్, ఎన్ఎస్ఎస్ అధికారి డాక్టర్ సదయకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now