సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 29 (ప్రశ్న ఆయుధం న్యూస్): భావి సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ పి .ప్రావీణ్య అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన చౌటకూర్ లో కలెక్టర్ ఆకస్మిక పర్యటన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ చోటాకూర్ లోని బస్తీ దావఖాన, అంగన్వాడి కేంద్రం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పరిశీలించారు. మండల కేంద్రమైన చోటాకూర్ లోని బస్తీ దవాఖాన ద్వారా రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. ఆసుపత్రిలో మందుల లభ్యత, జ్వర చికిత్స రికార్డులను ఈ సందర్భంగా కలెక్టర్ పరిశీలించారు. దావఖాన ద్వారా రోగులకు మెరుగైన వైద్య చికిత్స లందించాలని, సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా గ్రామ పంచాయతీల సిబ్బందితో కలిసి అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంను కలెక్టర్ తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో చిన్నారుల ఆరోగ్యం, బరువు విరువరాలను కలెక్టర్ పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రం ద్వారా గర్భిణీ స్త్రీలు, బాలింతలు చిన్నారులకు అందజేస్తున్న పౌష్టికాహారం నాణ్యతను పరిశీలించారు. భోజనం చేస్తున్న చిన్నారులను చూసి కలెక్టర్ ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం చౌటకూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ పరిశీలించారు పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాల లభ్యత, డిజిటల్ బోధన విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు. బావి భారత్ నిర్మాణం తరగతి గదుల్లోనే అవుతుందన్న బాపూజీ కలలను నిజం చేయాలని సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర మరువలేని కలెక్టర్ అన్నారు. ఉపాధ్యాయులు తమ విద్యార్థులలో క్రమశిక్షణను పెంపొందించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాలలో జరుగుతున్న డిజిటల్ బోధన విధానాన్ని ఉపాధ్యాయులు విద్యార్థులపై అమలు చేస్తున్న ముఖ గుర్తింపు హాజరు విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు. విద్యా, వైద్య రంగాల్లో నాణ్యమైన సేవలు అందేలా చర్యలు చేపట్టాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, పంచాయతీ రాజ్ అధికారులు, వైద్యాధికారులు, ఉపాధ్యాయులు, శిశు సంక్షేమాధికారులు తదితరులు పాల్గొన్నారు.
సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులదే కీలకపాత్ర: జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
Published On: August 29, 2025 4:34 pm