తెలంగాణ బయోసైన్స్ ఫోరం మెదక్ జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

మెదక్/నర్సాపూర్, అక్టోబరు 25 (ప్రశ్న ఆయుధం న్యూస్): మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లా జీవశాస్త్ర ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బయోసైన్స్ ఫోరం జిల్లా అధ్యక్షుడిగా దొంతి ప్రసన్నకుమార్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బంజారా నగర్), ప్రధాన కార్యదర్శిగా మెరుగు నరేందర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మక్త భూపతి పూర్, కోశాధికారిగా సతెల్లి రమణ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిన్న ఘనపూర్ ఏకగ్రీవంగా ఎంపిక అయ్యారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జీవశాస్త్రం నుంచి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి పొందిన మరియు ఇటీవల మండల విద్యాధికారిగా బాధ్యతలు చేపట్టిన ప్రతాప్ రెడ్డి, రామకిషన్, సురేందర్ గౌడ్, మాలతీ దేవిలు విచ్చేశారు. వీరికి నూతనంగా ఏర్పడిన కమిటీ శాలువాలతో సన్మానించారు. అదేవిధంగా ఇటీవల జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన చంద్రశేఖర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గోమారం, ఇప్పటి వరకు జిల్లాలో జూవలజీ పీజీటీగా పని చేసి రిసోర్స్ పర్సన్ గా సేవలందించి బదిలీపై సిద్దిపేట జిల్లాకు వెళ్లిన చంద్రిక దేవి, అదేవిధంగా జీవశాస్త్ర ఉపాధ్యాయులుగా పదోన్నతి పొందిన ఉపాధ్యాయులకు, 2024 ద్వారా నూతనంగా విధుల్లో చేరిన జీవశాస్త్రోపాధ్యాయులకు ఫోరమ్ తరపున సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎన్నికైన నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ.. జీవశాస్త్ర సంబంధిత అంశాలలో, పరీక్ష విధానంలో మార్పు, సబ్జెక్ట్ శిక్షణ, సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహణ గూర్చి అధికారుల, సహకారంతో విద్యార్థుల అభివృద్ధికి బయోసైన్స్ ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అశోక్, నాగరాజు, మల్లేశం, రవి, లింగప్రసాద్, శశికుమార్ రెడ్డి, రమేష్, వేణుగోపాల్, నసీర్, అరుణ, ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now