తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ

*తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ*

*విద్యోదయ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు*

*విద్యోదయ విద్యాసంస్థల అకాడమీ డైరెక్టర్ ఏబూసి మహాలక్ష్మి*

*జమ్మికుంట జూలై 20 ప్రశ్న ఆయుధం*

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా బోనాల పండుగ జరుపుకుంటారని ఈ పండుగకు చాలా విశిష్టత ఉందని విద్యోదయ విద్యాసంస్థల అకాడమిక్ డైరెక్టర్ ఏ బూసి మహాలక్ష్మి అన్నారు. జమ్మికుంట పట్టణంలోని విద్యోదయ విద్యా సంస్థలలో ఆషాడ మాసం పురస్కరించుకొని ఆదివారం అత్యంత భక్తిశ్రద్ధలతో బోనాల పండుగ వేడుకలు నిర్వహించారు. బోనాల వేడుకలో ప్రత్యేక మట్టి కుండలో వండిన బోనాన్ని అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించారు విద్యాసంస్థల డైరెక్టర్ మహాలక్ష్మి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బోనాల పండుగ అత్యంత ప్రీతికరమైనదని తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో తరాల నుండి అవలంబిస్తున్న ఈ ఘనమైనటువంటి సాంప్రదాయం ఎటువంటి లోటు పాటు లేకుండా కొనసాగించడం చాలా శుభపరిణామం అని తెలిపారు.బోనాల పండుగ ఉత్సవాలు వైభవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నదని అదే సంప్రదాయాన్ని నేటి తరం కొనసాగించడం తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకతని బోనాల పండుగను ఆషాడ మాసంలో ప్రారంభించి శ్రావణమాసం చివరి వరకు జరుపుకుంటారని తెలిపారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని పాడి పంటలు బాగా పండి రైతులు అభివృద్ధి చెందాలని ప్రజలంతా ఎలాంటి అనారోగ్యాల బారిన పడకుండా అమ్మవారిని గ్రామ దేవతలను కోరుకుంటూ జరుపుకునే పండుగ అని తెలియజేశారు. విద్యార్థులు ప్రదర్శించినటువంటి బోనాల పాటలపై నృత్యాలు అందరినీ ఆకర్షింపచేశాయి. విద్యార్థులు వివిధ సాంప్రదాయ దుస్తుల్లో విచ్చేసి బోనాలను ఎత్తుకొని పండుగ వాతావరణం సృష్టించారు. ప్రత్యేకంగా పోతురాజుల వేషధారణలో విచ్చేసిన చిన్నారులు చేసిన విన్యాసాలు చాలా అబ్బురపరిచాయి. ఈకార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ మహాలక్ష్మి, ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment