సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 13 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయాన్ని సందర్శించన తెలంగాణ రాష్ట్ర డీజీపీ డా. జితేందర్ జిల్లాలో ప్రధాన పట్టణాలైన సదాశివపేట, సంగారెడ్డి రూరల్ జోగిపేట బి.డి.ఎల్ భానూర్, అమీన్ పూర్ పటాన్ చెరు, ఝరాసంగం, నారాయణఖేడ్ పట్టణాలలో చైల్డ్ ఫ్రెండ్లీ కార్నర్స్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ డా.జితేందర్ మాట్లాడుతూ.. మైనర్ బాలబాలికలచే పోలీసు స్టేషన్ కు వచ్చే వారి సహాయార్థం, బాల నేరస్తులు పోలీసు స్టేషన్ కు వచ్చినప్పుడు వారికి మంచి వాతావరణాన్ని అలవరచాలనే ఉద్యేశంతో చైల్డ్ ఫ్రెండ్లీ కార్నర్ ను ప్రారంభించడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లలో ఈ చైల్డ్ ఫ్రెండ్లీ కార్నర్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. చైల్డ్ ఫ్రెండ్లీ కార్నర్ ద్వారా పిల్లలు పోలీసు స్టేషన్ కు వచ్చామనే భావన వారిలో కలగకుండా బొమ్మలతో, ఆట వస్తువులతో ఆడుకొనే విధంగా అహ్లాదకరమైన వాతావారం ఉంటుందన్నారు. చైల్డ్ ఫ్రెండ్లీ పోలీసు అధికారి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వారికి, వారి పిల్లల రక్షణ చట్టం-2015 నిర్ధేశించిన విధంగా సేవలను/ ప్రక్రియలను అందించడంలో ఎల్లవేళలా వారికి చేదోడు వాదోడుగా ఉంటారని వివరించారు. ఈ కార్యక్రమంలో మల్టీ జోన్-2 ఐ.జి వి.సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, యునిసెఫ్ బృందం, అదనపు ఎస్పీ ఎ. సంజీవ రావ్, సంగారెడ్డి డియస్పి సత్యయ్య గౌడ్, సదాశివపేట ఇన్స్పెక్టర్ మహేష్ గౌడ్ యస్.బి. ఇన్స్పెక్టర్స్ విజయ్ కృష్ణ, సదాశివపేట సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
*చైల్డ్ ఫ్రెండ్లీ కార్నర్స్ ను ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర డీజీపీ డా.జితేందర్*
Published On: August 13, 2024 8:49 pm