తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుంది: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 4 (ప్రశ్న ఆయుధం న్యూస్): సిగాచి పరిశ్రమంలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన, గాయపడిన కార్మికుల కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. శుక్రవారం ఆయన పటాన్ చెరు మండలం పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి ఫార్మా పరిశ్రమను సందర్శించారు. స్పెషల్ సెక్రటరీ రెవెన్యూ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ,అరవింద్ కుమార్, పరిశ్రమలు, కార్మిక శాఖ, స్పెషల్ సెక్రటరీ దాన కిషోర్, జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య, జిల్లా ఎస్పీ పరతోష్ పంకజ్, అగ్నిమాపక శాఖ అధికారుల తో పరిశ్రమలో అగ్నిమాపక శాఖ, పొల్యూషన్, డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది, పరిశ్రమల శాఖ సిబ్బంది, కంపెనీ ప్రతినిధులు, పోలీసులు, రెవెన్యూ అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్ష జరిపారు. ప్రమాదానికి దారి తీసిన కారణాలు, పరిశ్రమల భద్రతా ప్రమాణాలు, సేఫ్టీ మెకానిజం నిర్వహణపై సంబంధిత శాఖలతో ఆయన సమీక్షించారు. పరిశ్రమలో రియాక్టర్లు, డ్రైయర్లు, ఫైర్ ఫైట్ సిస్టం, ఉద్యోగుల రక్షణ మార్గాలు, ఇతర భద్రతా అంశాలపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడుతూ.. ప్రమాదంలో గాయ పడిన వారికి మెరుగైన వైద్య సేవలందించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. పరిశ్రమల భద్రతా ప్రమాణాలపై పూర్తి స్థాయిలో చర్యలు చేపడతామన్నారు. ప్రమాదంలో గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి వివరాలు మృతుల వివరాలు మృతుల ఐడెంటిఫికేషన్ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యుల కోసం ఐలా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సహాయక కేంద్రాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సందర్శించారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా త్వరలో మృతుల కుటుంబాలకు క్షతగాత్రుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సహయ చర్యలు మరింత సమర్థవంతంగా సాగేందుకు చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment