సంగారెడ్డి, ఆగస్టు 19 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి పట్టణంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు నక్క నాగరాజుగౌడ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గౌడ కులస్తుల దీర్ఘకాల కోరిక మేరకు పాపన్న విగ్రహం ప్రతిష్టించబడిందని తెలిపారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి హరీష్ రావు, సంగారెడ్డి శాసన సభ్యుడు చింత ప్రభాకర్ ప్రత్యేకంగా ముందడుగు వేసి, సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ఎదురుగా విగ్రహ స్థలాన్ని కేటాయించారని గుర్తు చేశారు. అలాగే గౌడ భవన నిర్మాణం కోసం చేర్యాల గ్రామంలో ఎకరా స్థలాన్ని కేటాయించారని అన్నారు. ఈ సందర్భంగా గౌడ సంఘాల తరఫున మాజీ మంత్రి హరీష్ రావు, శాసన సభ్యుడు చింత ప్రభాకర్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సంగారెడ్డిలో సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గౌడ సంఘాల పెద్దలు, నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.
పాపన్న విగ్రహావిష్కరణను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు: సంగారెడ్డి జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు నక్క నాగరాజుగౌడ్
Published On: August 19, 2025 11:07 am