రిజర్వేషన్లు కల్పిస్తామంటే బీజేపీకి భయం పట్టుకుంది: పొన్నం
Aug 08, 2025, రిజర్వేషన్లు కల్పిస్తామంటే బీజేపీకి భయం పట్టుకుంది: పొన్నం
తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటే బీజేపీకి భయం పట్టుకుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. అందుకే తాము అపాయింట్‌మెంట్ కోరి 10 రోజులు అవుతున్నా రాష్ట్రపతిని కలవనివ్వ లేదన్నారు. సీఎం, కేబినెట్ మెంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా ఢిల్లీలో ఎదురు చూసినా రాష్ట్రపతి ఎందుకు అపాయింట్‌మెంట్ ఇవ్వట్లేదని ప్రశ్నించారు. ఇకనైనా ముస్లింల పేరుతో బీసీ రిజర్వేషన్లను అడ్డుకునే ప్రయత్నం కిషన్ రెడ్డి మానుకోవాలన్నారు.