వేములవాడ ఆలయ చెరువులో యువకుడి మృతదేహం లభ్యం.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ చెరువులో వేములవాడ పట్టణంలోని శాస్త్రి నగర్ కు చెందిన మైత్రి నవీన్( 19)అనే యువకుని మృతదేహం ఈరోజు ఉదయం లభ్యమైంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. సంఘటనకు సంబంధించిన వివరాలు కూడా సేకరిస్తున్నారు.యువకుడు ఈత కొట్టడానికి చెరువులో దూకి ప్రమాదవశాత్తు మృతి చెందడా? లేక ఏమైనా కారణాలు ఉన్నాయా? అనే విధంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు..