తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించిన సీఎం
సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి అందుకు స్థల పరిశీలన చేశారు. సచివాలయ ప్రాంగణంలో విగ్రహం ఎక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందనే విషయమై పరిశీలించారు. విగ్రహం డిజైన్ తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా విగ్రహం ఉండాలన్నారు. ఇందుకోసం అవసరమైన పూర్తి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.