బెస్ట్ అవైల్డ్ ఎబుల్ విద్యార్థుల స్కాలర్షిప్‌ల విడుదలకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు వినతి

సంగారెడ్డి, అక్టోబర్ 9 (ప్రశ్న ఆయుధం న్యూస్): బెస్ట్ అవైల్డ్ ఎబుల్ స్కీమ్ కింద చదువుతున్న ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన పేద విద్యార్థుల పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్‌లను వెంటనే విడుదల చేయాలని కోరుతూ, ప్రైవేట్ విద్యా సంస్థల ప్రతినిధులు జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ.. గత మూడేళ్లుగా ప్రభుత్వం నుండి స్కాలర్షిప్ నిధులు రాకపోవడం వల్ల పాఠశాలలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, ఫలితంగా విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు, మరియు భోజన సదుపాయాలు సకాలంలో అందించడం కష్టంగా మారిందని పేర్కొన్నారు. ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకుని పెండింగ్ బిల్లులను విడుదల చేస్తే, పేద విద్యార్థుల విద్యా భవిష్యత్తు కాపాడవచ్చని తెలిపారు. బెస్ట్ అవైల్డ్ ఎబుల్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఇప్పటికే స్కీమ్ నిలిపివేత నిర్ణయం తీసుకోవడం విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళనకు దారి తీసిందని వారు గుర్తు చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment