“ప్రజలకు మంచి మౌలిక సదుపాయాలు కల్పించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం..”
*ప్రశ్న ఆయుధం,జులై 16 శేరిలింగంపల్లి,ప్రతినిధి*
గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి , మంత్రులు పక్క ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని అన్నారు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్.
హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీ థీమ్ పార్కును డిప్యూటీ కమిషనర్ శశిరేఖ,స్థానిక నాయకులతో కలసి పార్క్ అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించి,పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు గ్రేటర్ హైదరాబాద్ స్టాండింగ్ కమిటీ సభ్యులు,శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్.
శేరిలింగంపల్లి నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తామని,అధికారుల సమన్వయంతో,పార్కులు,రోడ్లు,డ్రైనేజీలు,నీటి సరఫరా వంటి అభివృద్ధి పనులను వేగవంతం చేయడమే తమ కర్తవ్యమని,ప్రతి ఒక్క పౌరుడు మెరుగైన జీవన ప్రమాణాలను పొందేలా చర్యలు తీసుకుంటున్నామని,ప్రజలకు మంచి మౌలిక సదుపాయాలు కల్పించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని అన్నారు..
ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం నాయకులు మిరియాల రాఘవరావు,కట్ల శేఖర్ రెడ్డీ,మిరియాల ప్రీతం,శ్రీనివాస్,రాజేశ్వర గౌడ్,ప్రభాకర్,శంకర్,కిషోర్,మోసిన్,రవి,ప్రసాద్,హెల్త్ ఆఫీసర్ రవి,కిరణ్,శ్రీనువాస్,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు మంచి మౌలిక సదుపాయాలు కల్పించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం
by Madda Anil
Published On: July 16, 2025 8:35 pm