పార్కు వాకింగ్ ట్రాక్ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి  బియన్ రెడ్డి నగర్ కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి 

పార్కు వాకింగ్ ట్రాక్ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి

బియన్ రెడ్డి నగర్ కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి

వనస్థలిపురం , అక్టోబర్ 24: (ప్రశ్న ఆయుధం) బియన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర కాలనీలో 15.50 లక్షల రూపాయలతో అభివృద్ధి చేస్తున్న పార్క్ లో నిర్మించనున్న వాకింగ్ ట్రాక్ స్థలమును బియన్ రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి, సంబంధిత ఇంజనీరింగ్ విభాగం ఏఈ కార్తీక్ గారితో కలిసి పర్యవేక్షించడం జరిగింది.

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ నాణ్యత, లెవెల్స్ సరి చూసుకుంటూ వాకింగ్ ట్రాక్ నిర్మాణం చేపట్టాలని, పార్కును అభివృద్ధి చేసే పనులు త్వరగా పూర్తిచేయాలని, కాలనీ వాసులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచనలు ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment