సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబరు 1 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు, పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, డిఆర్ఓ పద్మజరాణిలకు విన్నవిస్తూ ఫిర్యాదులను సమర్పించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికివచ్చిన ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. కాగా రెవిన్యూ -16, పౌర సరఫరాల శాఖ 03, డీఆర్ డిఓ 04, వివిధ శాఖలకు సంబంధించి 21 మొత్తంగా 44 ఫిర్యాదులు అందాయి. ప్రతి దరఖాస్తును జాగ్రత్తగా పరిశీలించి, సంబంధిత శాఖల అధికారి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. సమస్యల పరిష్కారానికి గడువులు నిర్దేశించి, ప్రజలకు త్వరితగతిన స్పందించాలని అన్నారు. ప్రజలకు అండగా నిలబడటం ప్రజావాణి ఉద్దేశమని, ప్రజల సమస్యలను తీర్చడమే ప్రథమ కర్తవ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి: జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
Published On: September 1, 2025 5:39 pm