సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 24 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా పుల్కల్ గ్రామంలోని శ్రీదా ఆసుపత్రిని అర్హత లేని వైద్యుడు నిర్వహిస్తున్నట్లు గుర్తించి సీజ్ చేసినట్లు జిల్లా వైద్యాధికారి నాగనిర్మల తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆసుపత్రి అర్హత కలిగిన వైద్యుని పేరుతో నమోదై ఉన్నప్పటికీ, ఆయనే తరచుగా హాజరు కాకుండా, అర్హత లేని వ్యక్తులు వైద్య సేవలు అందిస్తున్నారని విచారణలో తేలిందని అన్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం పరిశీలన జరిపి, నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆసుపత్రిని సీజ్ చేసి, ఐదు రోజులలో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ప్రజల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా, అర్హత లేని వ్యక్తులు వైద్య సేవలు అందించకుండా కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌ఓ నాగనిర్మల హెచ్చరించారు.
పుల్కల్ లో శ్రీదా ఆసుపత్రిని సీజ్ చేసిన జిల్లా వైద్యాధికారి
Published On: October 24, 2025 8:01 pm