కన్కల్ గ్రామంలో నూతన పాలకవర్గ తొలి సమావేశం
గ్రామాభివృద్ధే లక్ష్యంగా కార్యాచరణపై చర్చ
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం డిసెంబర్ 22
కన్కల్ గ్రామంలో నూతనంగా ఎన్నికైన పాలకవర్గం తొలి సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సమావేశానికి సర్పంచ్ మైలారం రవీందర్ రెడ్డి అధ్యక్షత వహించగా, ఉప సర్పంచ్ చాకలి మహేందర్ హాజరయ్యారు. గ్రామాభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదల, పారిశుధ్యం, తాగునీరు, రహదారుల అభివృద్ధి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. గ్రామ సమస్యలను సమన్వయంతో పరిష్కరించి, పారదర్శక పాలన అందిస్తామని పాలకవర్గ సభ్యులు పేర్కొన్నారు. సమావేశంలో వార్డు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.