తుది శ్వాస వరకు భారతమాత సేవలో తరించి యువత భవిత కోసం తపించిన మహా తపస్వి అబ్దుల్ కలాం.
మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏ.పి.జే.అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ డాక్టర్ అన్నం సేవా ఫౌండేషన్ అనాధల ఆశ్రమంలో కధంబం మొక్కను నాటడం జరిగింది . ఈ కార్యక్రమంలో అన్నం సేవా ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ అన్నం శ్రీనివాసరావు , సామాజికవేత్త పర్యావరణ మిత్ర జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ కడవెండి వేణుగోపాల్ , కేశవపట్నం శ్రీనివాస్ , గడ్డం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు .