*ఎల్బీ స్టేడియం సభకు నాగారం కాంగ్రెస్ శ్రేణుల భారీ కదలిక*
మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం జూలై 4
హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఈరోజు జరుగుతున్న ‘జై బాపు జై భీమ్ జై సంవిధాన్’ బహిరంగ సభకు నాగారం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా తరలివెళ్లాయి. మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో ఈ సభలో పాల్గొన్నారు.
ఈ సభ గాంధీజీ సిద్ధాంతాలు, అంబేడ్కర్ స్ఫూర్తి, రాజ్యాంగ పరిరక్షణకు సంకేతంగా నిర్వహించబడుతోంది. సభ విజయవంతం కావడంలో భాగంగా నాగారం నుండి హాజరైన కార్యకర్తలు తమ పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు. పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ శ్రేణులు యుద్ధప్రాతిపదికన ముందుకు సాగుతున్నట్లు నాయకులు పేర్కొన్నారు.