*లారీ, డీసీఎం వ్యాన్ ఢీ కొనడంతో డ్రైవర్ మృతి* *ఇద్దరికీ తీవ్ర గాయాలు*

మెదక్/నర్సాపూర్, ఆగస్టు 15 (ప్రశ్న ఆయుధం న్యూస్): నర్సాపూర్ లో ప్రధాన రహదారిపై డీసీఎం వ్యాన్ ను లారీ బలంగా ఢీ కొట్టడంతో డ్రైవర్ మృతి చెందాడు. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. గురువారం రాత్రి నర్సాపూర్ లో ప్రధాన రహదారిపై వెళ్తున్న డీసీఎం వ్యాన్ ను వెనుక నుంచి లారీ బలంగా ఢీ కొనడంతో డీసీఎం వ్యాన్ రోడ్డు పక్కన ఉన్న దుకాణాల పైకి దూసుకెళ్లింది. డీసీఎం వ్యాన్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొని నుజ్జునుజు కాగా.. డ్రైవర్ అందులోనే ఇరుక్కుపోయాడు. దీంతో స్థానికులు డ్రైవర్ ను బయటకు తీసే ప్రయత్నం చేశారు. కాగా డ్రైవర్ అమీర్ మృతి చెందగా.. ఇద్దరు తీవ్ర గాయాలకు గురైనట్లు స్థానికులు తెలిపారు. వెంటనే వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Join WhatsApp

Join Now