సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 6 (ప్రశ్న ఆయుధం న్యూస్):భూముల రీ సర్వే పైలట్ ప్రాజెక్టుతో భూ సమస్యలన్నీ శాశ్వతంగా పరిష్కారం అవుతాయని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. బుధవారం అందోల్ ఆర్డీవో కార్యాలయాన్ని సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ జిల్లా అధికారి ఐనేష్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ… భూముల రీ సర్వే కోసం ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా జిల్లాలోని ఆందోల్ డివిజన్ వట్పల్లి మండల పరిధిలోని షాహేద్ నగర్ (గట్టుపల్లి) గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా రీ సర్వే పైలట్ ప్రాజెక్టు పురోగతిపై కలెక్టర్ సమీక్ష జరిపారు. రీ సర్వే పైలెట్ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత తుది రికార్డులను కలెక్టర్ పరిశీలించారు. పహానిలు, మోకాపై ఉన్న రైతుల వివరాలు, ల్యాండ్ అక్యుపేషన్ ప్రక్రియ భూముల రీమార్కులు వంటి అంశాలపై మినిట్ స్థాయిలో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పైలట్ ప్రాజెక్టు ద్వారా భూసంబంధిత సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులకు ఆదేశించారు. భవిష్యత్తులో భూముల విషయంలో ఉన్న సందిగ్ధతకు ఈ రీ సర్వే ప్రాజెక్టు ఒక తుది నివేదికల నిలవాలని కలెక్టర్ సూచించారు. రీ సర్వేకు సంబంధించిన అన్ని రికార్డులు జియో ట్యాగింగ్ చేయడం, భూహక్కుల వివరాలు డిజిటల్ రూపంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆర్డిఓ కార్యాలయానికి వచ్చిన ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి ఫిర్యాదును సమగ్రంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అందోల్ ఆర్డీవో కార్యాలయం సందర్శన అనంతరం కలెక్టర్ ప్రావీణ్య అందోల్ లోని భవిత కేంద్రాన్ని సందర్శించారు. అదేవిధంగా అందోల్ ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన ఆచార్య జయశంకర్ జయంతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పాల్గొన్నారు. తెలంగాణ తొలి దశ ఉద్యమంలో పోరాడి మల్లికార్జున స్వస్థ సాధనకు ఆచార్య జయశంకర్ మార్గదర్శిగా నిలిచారన్నారు. రైతుల కోసం నిరంతరం పోరాడిన ఆచార్య జయశంకర్ సేవలను కొనియాడారు. ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ అభివృద్ధిలో ఆయన కలిగించిన ప్రేరణ గుర్తు చేశారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం అందోల్ డివిజన్ కేంద్రంలో ఏర్పాటు చేసిన సాండ్ బజార్ ను కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మాధురి, జిల్లా సర్వే ల్యాండ్ రికార్డ్ సహాయ సంచాలకులు ఐనేష్, ఆందోల్ ఆర్డీవో పాండు, ఆందోల్ తహసిల్దార్ మధుకర్ రెడ్డి, ఎంపీడీవో రాజేష్ కుమార్, ఐఈఆర్ పి అధికారి విజయ చారి, రెవెన్యూ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
రీ సర్వే పైలెట్ ప్రాజెక్టుతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం: జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
Published On: August 6, 2025 5:13 pm