జీవితంలో స్థిరంగా ఉండే ఏకైక విషయం మార్పు. మార్పుకు అందరు సిద్ధంగా ఉండాలి.
నేటి ధనవంతులు రేపటికి పేదవారు కావచ్చు, నేటి పేదవారు రేపు కోటీశ్వరులు కావచ్చు.
కీర్తి, అదృష్టం రెండూ కొంతమందికి పోవచ్చు మరికొందరికి ఊహించని విధంగా విపరీతమైన పేరు ప్రఖ్యాతలు రావచ్చు.ఋతువులు మారడం ఎంత సహజమో మార్పు కూడా అంతే సహజం. పగలు రాత్రిగా మారినట్టు ప్రతి మనిషి జీవితంలో మార్పు ఏదో రకంగా వస్తూనే ఉంటుంది.ఆ మార్పుకు మనం సిద్ధంగా ఉండాలి.కొన్ని మార్పులు మనల్ని ఇబ్బంది పెట్టవచ్చు.అయినా సరే వాటిని సానుకూలంగా తీసుకొని జీవితంలో ముందుకే సాగాలి అప్పుడే మనం అనుకున్నవన్ని సాధించగలం.ప్రపంచ కుబేరుల్లో.. ఒకరు టాటా గారు ఏం తీసుకెళ్లారు..?_*నాకు తెలిసి తను చాలా తీసుకెళ్లారు.. భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి అంతర్లీలంగా తన సేవలను అందించారు. అదే కదా మనిషిగా తాను పుట్టినందుకు సార్ధకత్వం.సుఖభోగాలను కలిగించే వస్తువులు, సుఖాలను పొందే పద్ధతులు ఎంతగా పెరిగిపోయినా, జీవితాన్నీ, పరమసత్యాన్నీ గురించిన మన మౌలిక ధోరణులు మారకుండా నిజమైన సంతోషం, శాశ్వతమైన సంతృప్తి మనకు దొరకవు.. ఎందుకు….?ఎందుకంటే సుఖమనేది ఇంద్రియాలను ఉద్రేకపరచడం ద్వారా కలుగుతుంది, కొద్దిసేపు మాత్రమే నిలిచి ఉంటుంది.కానీ, నిజమైన ఆనందానికీ, ఇంద్రియాలకీ ఏ సంబంధమూ లేదు. నిజమైన ఆనందం శాశ్వతం. అది గుండెలోతులలోంచి పైకి ఉబికి వస్తుంది. స్వార్థపూరితమైన, అహంకార కేంద్రియమైన ఉద్రేకాల వల్ల సుఖం కలిగితే, ఆనందం స్వార్థాన్ని విడిపెట్టి ఇతరుల సంక్షేమాన్ని కోరడం ద్వారా మాత్రమే లభిస్తుంది. అందుకే.. సర్వేజనాః సుఖినోభవంతు..