సంగారెడ్డి ప్రతినిధి, ఏప్రిల్ 18 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఆత్మ కమిటీలు రైతు సంక్షేమం కోసం పని చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. శుక్రవారం రాయికోడు ఆత్మ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారం కారోత్సవానికి ఆయన ముఖ్యఅతిథి హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. మునిపల్లి, రాయికోడ్, వట్టిపల్లి మండలాలకు సంబంధించిన రాయికోడ్ ఆత్మ కమిటీ నూతన చైర్మన్ గా మెట్ పల్లి మండలానికి చెందిన నాలచెరు కచూర్ రావు, పాలకవర్గ సభ్యులు శుక్రవారం రాయికోడ్ మార్కెట్ కమిటీ ఆవరణలో నీ ఆత్మ కమిటీ కార్యాలయం వద్ద లో ప్రమాణస్వీకారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడారు. అందోల్ నియోజకవర్గంలోని వెనుకబడిన ప్రాంతాలైన రాయికోడ్, వట్పల్లి, మునిపల్లి మండలాల అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఈ ప్రాంత అభివృద్ధి చెందాలంటే రోడ్డు రవాణా సౌకర్యాలు మెరుగుపడాలని అందుకోసం ప్రత్యేక శ్రద్ధతో నియోజకవర్గ పరిధిలోని రోడ్లకు మరమ్మత్తులు చేపట్టడంతో పాటు నూతన రోడ్ల ఏర్పాటుకు పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. వైద్య సౌకర్యాలు మెరుగు కోసం వట్పల్లిలో రూ 15 కోట్లతో ఏరియా ఆసుపత్రి నిర్మాణం అల్లాపూర్ సింగీతం గ్రామాలలో నూతనంగా ఒక్కొక్కటి ఐదు కోట్ల తో రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణం పడలు చురుగ్గా సాగుతున్నట్లు మంత్రి తెలిపారు. 4.50 కోట్ల తో చేపట్టిన కప్పాడు, రాయికోడు, 4.4 కిలోమీటర్ల మేర బిటి రోడ్డు మరమ్మత్తు పనులు చురుగ్గా సాగుతున్నాయని,త్వరలో పనులు పూర్తయి రవాణా సౌకర్యాలు మెరుగవుతాయని అన్నారు. దీంతో పాటు నియోజకవర్గ పరిధిలోని వట్టిపల్లి మరవెల్లి, రాయికోడ్ తదితర ప్రాంతాలకు లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల ద్వారా సాగునీరు అందించేందుకు కోసం అంచనాలు రూపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.ఆత్మ కమిటీ సభ్యులు రైతుల మనసులో స్థానం పొందేలా రైతులకు అధునాతన పద్ధతులపై తరచూ శిక్షణలు కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ప్రతినెల రైతులతో సమావేశాలు ఏర్పాటు చేయడం కమిటీ సమావేశాలు నిర్వహించడం అన్ని మండలాలలో రైతులకు అధునాతన పద్ధతులపై అవగాహన కల్పించడం లాంటి కార్యక్రమాలు చేపట్టాలని ఈ సందర్భంగా మంత్రి కమిటీ సభ్యులకు చైర్మన్ కు సూచించారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి 15 నెలల కాలం కావస్తుందని 15 నెలల కాలంలో రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రభుత్వం చేపట్టిందన్నారు. ముఖ్యంగా నిరుద్యోగ యువకుల కోసం రాజీవ్ యువ వికాసం యొక్క పథకం చేపట్టిందన్నారు. ఈ పథకం కోసం నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నిరుద్యోగ యువకులు అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు చేసుకోవాలని మంత్రి ఈ సందర్భంగా సూచించారు. ప్రతిష్టాత్మకంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందన్నారు. గతంలో రేషన్ దుకాణాలలో వచ్చే బియ్యాన్ని ఎవరు తినేవారు కారని తిరిగి దళారులకు కానీ ఇప్పుడు సన్న బియ్యం కోసం క్యూ లైన్ లో నిలబడి ప్రజలు కొనుగోలు చేస్తున్నారని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంజయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్, సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ నాలాచెరు కచూర్ రావు, బీసీ సంక్షేమ శాఖ అధికారి జగదీష్, ఆర్డీవో రామిరెడ్డి, ఏడిఎ సత్యనారాయణ, ఎంపీడీవో షరీఫ్, ప్రజా ప్రతినిధులు, రైతులు, సంబంధిత అధికారులు తదితరులు సిబ్బంది పాల్గొన్నారు.
రైతుల సంక్షేమం కోసం ఆత్మ కమిటీ పని చేయాలి: మంత్రి దామోదర్ రాజనర్సింహ
Updated On: April 18, 2025 9:10 pm
