Site icon PRASHNA AYUDHAM

గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం జిల్లాకు పరిశీలకులను నియమించిన రాష్ట్ర ఎన్నికల సంఘం

IMG 20251127 173558

Oplus_16908288

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబర్ 27 (ప్రశ్న ఆయుధం న్యూస్): జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణను నిస్పాక్షికంగా, పారదర్శకంగా, శాంతియుతంగా జరపడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ఇద్దరు అధికారులను పరిశీలకులుగా నియమించింది. జిల్లాకు పంచాయితీ ఎన్నికల సాధారణ పరిశీలకులుగా ఐఏఎస్ అధికారి పి.ఉదయ్ కుమార్ ను, వ్యయ పరిశీలకులుగా జిల్లా ఆడిట్ ఆఫీసర్ జి. రాకేష్ లను నియమించింది. ఎన్నికల ప్రక్రియలో సాధారణ పర్యవేక్షణ, అభ్యర్థుల ఖర్చుల పర్యవేక్షణ వంటి అంశాలను పరిశీలకులు పర్యవేక్షిస్తారు. ఎన్నికల పరిశీలకులు ఇద్దరూ జిల్లాకు విచ్చేశారు. గురువారం సాధారణ పరిశీలకులు పి.ఉదయ్ కుమార్ ఐఏఎస్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి కంది మండలం కవలంపేట గ్రామంలో నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని సందర్శించి, నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను, నామినేషన్లను పరిశీలించారు. ఎన్నికల నిబంధనల మేరకు నడుచుకోవాలని వారు సూచించారు. కలెక్టర్ వెంట ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీఓ సుధీర్ తదితరులు ఉన్నారు. వ్యయ పరిశీలకులు జి.రాకేష్ సంబంధిత అధికారులతో సమావేశమై ఎన్నికలలో అభ్యర్థులు ఖర్చు చేసే ప్రతి పైసా పై నిఘా ఉంచాలన్నారు. నిబంధనల మేరకు పారదర్శకంగా నడుచుకోవాలని ఆదేశించారు.

Exit mobile version