సంగారెడ్డి/పటాన్ చెరు, ఆగస్టు 10 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలోని మంత్రికుంటలో గ్రామస్తుల ఆధ్వర్యంలో వేదమంత్రాల మంత్రోచ్ఛారణ మధ్య శ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ పవిత్ర వేడుకకు ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి, మాజీ జడ్పిటిసి కోలన్ బాల్ రెడ్డి, వెంకటేశం గౌడ్, ప్రకాశంచారి తదితరులు హాజరై పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. దేవాలయ నిర్మాణానికి చిమ్ముల గోవర్ధన్ రెడ్డి 1,00,116 రూపాయల విరాళం అందజేస్తూ, గ్రామ అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాల ప్రోత్సాహానికి ఎల్లప్పుడూ తోడ్పాటును అందిస్తానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “దేవాలయాలు మన సంస్కృతి, సంప్రదాయాల ప్రతీకలు అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నాయికోటి రాజేష్, మాజీ సర్పంచులు సురేందర్ గౌడ్, జనార్దన్, ఆంజనేయులు, నరేందర్, ఖదీర్, శ్రీనివాస్ రెడ్డి, బశెట్టి రాజు, శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెంటేష్, మోహన్, శ్రీధర్ గౌడ్, నగేష్, భీమ్ రావు, శ్రీకాంత్ గౌడ్, గణేష్, రాజు గౌడ్, సాయి భరత్, శ్రీనివాస్ గౌడ్, మల్లేష్, శ్రీనివాస్, అనిల్, శేఖర్, అది ఆంజనేయులు, నిఖిల్ గౌడ్, గోపాల్, నర్సిములు, గ్రామ పెద్దలు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఘనంగా మంత్రికుంట పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం
Published On: August 10, 2025 6:28 pm