సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 15 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి పట్టణంలోని ముదిరాజ్ సంఘ భవనంలో 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన వేడుకలకు సంగారెడ్డి జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు పులిమామిడి రాజు ముఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం పులిమామిడి రాజు మాట్లాడుతూ.. ఎంతో మంది మహనీయుల పుణ్యఫలం, పోరాటం, ప్రాణ త్యాగాల వలన మనకు స్వాతంత్రం లభించిందని, దీనిని మనం అందరం కాపాడుకోవాలని, యువత అందరూ స్వయం కృషితో ఎదుగుతూ భారతదేశ అభివృద్ధికి తోడ్పడాల్సిందిగా సూచించారు. ప్రతి ఒక్క యువత కూడా దేశం మనకేమిచ్చింది అని అనుకోకుండా దేశానికి మనమేమిచామని ఆలోచించినప్పుడే మన దేశం మరింత బాగుపడుతుందని సూచించారు. నేటి యువత డ్రగ్స్ బారిన పడకుండా చెడు అలవాట్లకు గురి కాకుండా చూసే బాధ్యత మనందరి పైన ఉందని తెలిపారు. భారతీయులందరూ కలిసికట్టుగా ఉన్నట్టయితే మన దేశం మరింత అభివృద్ధి చెందుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు పిట్టల రమేష్, శేఖర్, రామకృష్ణ, తిరుమల్, జనార్ధన్, గోపన్నగారి రమణ, ఎస్వి డిజిటల్ శ్రీనివాస్, పీఎంఆర్ యువసేన నాయకులు పాల్గొన్నారు.
*సంగారెడ్డిలో ముదిరాజ్ సంఘం భవనంలో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా*
Published On: August 15, 2024 4:09 pm