జిల్లా కలెక్టర్‌ను కలిసిన గ్రామ పాలన అధికారులు

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 7 (ప్రశ్న ఆయుధం న్యూస్): గ్రామ పాలన అధికారులుగా ఎంపికైన నూతన అధికారులు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేయడంలో నూతన గ్రామ పాలన అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. జిల్లాలో 1వ విడతలో 174 మంది, 2వ విడతలో 46మంది ఇలా మొత్తం 220 మంది గ్రామ పాలన అధికారులుగా ఉత్తీర్ణులయ్యారని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్. సత్యనారాయణ, డి. సంతోష్ కుమార్, నాగేశ్వరరావు, శివరాం, శివరామకృష్ణ, నాగరాజు, మల్లేశం తదితర అధికారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment