వయోవృద్ధుల జ్ఞానం సమాజానికి అమూల్యం: కలెక్టర్

వయోవృద్ధుల జ్ఞానం సమాజానికి అమూల్యం: కలెక్టర్

అంతర్జాతీయ వయోవృద్ధులు దినోత్సవంలో సందేశం

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం నవంబర్ 21: 

 

వయోవృద్ధుల అనుభవం, జ్ఞానం, విలువలు సమాజ నిర్మాణానికి పునాది అని, వారికి గౌరవం, ఆరోగ్యం, భద్రత కల్పించడం ప్రతి పౌరుడి బాధ్యత అని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధులు దినోత్సవం-2025 సందర్భంగా “Older Persons Driving Local & Global Action – మన ఆకాంక్షలు, మన శ్రేయస్సు, మన హక్కులు” థీమ్‌తో జరిగిన కార్యక్రమంలో పాల్గొని జ్యోతిప్రజ్వలన చేశారు. వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. క్రీడల్లో విజేతలకు మెమెంటోలు అందించి, అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో శాఖాధికారులు, రెడ్‌క్రాస్ ప్రతినిధులు, తహసిల్దార్, మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment