వికలాంగు వృద్ధిరాలికి కొల్లి ఫౌండేషన్ వారి ఆర్థిక సహయం
పాల్వంచ మండలంలోని పాత పాల్వంచ వాసి బాబూరి గీత (వికలాంగురాలు) వయసు 53 సంవత్సరాలు వీరిది చాలా నిరుపేద కుటుంబం వారి కుమారుడు కూడా 22 సంవత్సరాలు వారు కూడా అంగవైకల్యంతో సరిగా నడవలేక పోవడంతో కుటుంబ భారాన్ని మోస్తూ ఆమె ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ కుటుంబాన్ని నెట్టుకు వస్తున్నారు. ఈ విషయం కొల్లి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు కల్పన గారి దృష్టికి రావడంతో వెంటనే స్పందించిన కల్పన చౌదరి గారు 40 వేల రూపాయల ఆర్థిక సహాయంతో బ్యాటరీ ట్రైసైకిల్ ను అందించడం జరిగింది. ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్పనా చౌదరి చేతుల మీదుగా ట్రైసైకిల్ అందజేయడం జరిగింది. కొల్లి ఫౌండేషన్ చైర్మన్ గారికి వృధ్ధిరాలు జీవితాంతం రుణపడి ఉంటానని, మరియు నా లాగ వివిధ అంగవైకల్యం కలిగి ఉన్న బాధితులకు చేయుతనందించాలని ఆనందం వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ జిల్లా కోఆర్డినేటర్ రూప్లానాయక్, హరినాథ్ చౌదరి, తదితరులు పాల్గొన్నారు.